రైతులు ఆర్థికాభివృద్ధి సాధించాలి: ఎమ్మెల్యే

సంగారెడ్డి,మే14(జ‌నం సాక్షి):  ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో రైతులు ఆర్థికాభివృద్ధి సాధించాలని నారాయణ్‌ ఖేడ్‌ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి ఆకాంక్షించారు. సోమవారం ఖేడ్‌ మండలం నిజాంపేటలో రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు, రైతుబంధు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ రైతులు దేశానికి వెన్నెముక అన్నారు. రాష్ట్రంలో అత్యధిక శాతం ఉన్న రైతులు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం పురోభివృద్ధి చెందుతుందన్నారు. అందుకే రైతుల సంక్షేమం కోసం తెరాస ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సర్పంచి సాయిరెడ్డి,  మండల రైసస సమన్వయకర్త సత్యపాల్‌రెడ్డి, నాయకులు ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.