రైతులు మరణించిన దాఖలాలు లేవు
నష్టపరిహారంపై కేంద్రమంత్రి తోమర్
న్యూఢల్లీి,డిసెంబర్1 ( జనం సాక్షి) : వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదిపాటు జరిగిన ఆందోళనల్లో మరణించిన 750 మంది రైతులకు ఆర్థిక సాయం అందించడం కుదరదని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. ఆందోళనల్లో మరణించిన రైతులకు రూ.25 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తున్నారా లేదా..? అని ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ రాతపూర్వక సమాధానం ఇచ్చారు.వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢల్లీి సరిహద్దుల్లో ఆందోళన చేస్తూ మరణించిన రైతులకు సంబంధించి ప్రభుత్వం దగ్గర ఎలాంటి రికార్డులు లేవని, కాబట్టి వారికి నష్టపరిహారం చెల్లించడం సాధ్యం కాదని కేంద్ర మంత్రి తోమర్ తన రాతపూర్వక సమాధానంలో పేర్కొన్నారు. రికార్డులు లేనందున ప్రతిపక్షాలు ఇకపై ఆ ప్రస్తావన తేవొద్దని మంత్రి కోరారు.