రైతుల ఆత్మహత్యలపై పోచారం విచారం
హైదరాబాద్,సెప్టెంబర్29(జనంసాక్షి):
రైతు సమస్యలపై చర్చ సందర్భంగా వ్యవసాయశాఖమంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ…. రైతు ఆత్మహత్యల వార్తలు బాధాకరమన్నారు. విత్తు వేశాక వర్షం లేక పంటలు దెబ్బతిన్నాయన్నారు. రాష్ట్రంలో 80శాతం విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయని తెలిపారు. ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైందన్నారు. నిజామాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో వర్షాభావం వల్ల 70శాతం పంటలు, మహబూబ్‌నగర్ జిల్లాల్లో నూరు శాతం పంట దెబ్బతిన్నదని తెలిపారు. విత్తనాలు, ఎరువులు, విద్యుత్ సరఫరా కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందన్నారు. వర్షాభావం వల్ల బోర్లు అధికంగా వేయడం వల్లే రైతుల్లో నిస్సహాయత వెల్లువెత్తుతోందన్నారు. రుణమాఫీని మిగిలిన 50శాతం కూడా పూర్తి చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు.