రైతుల ఆత్మహత్యలు గుర్తించేందుకు సర్కార్ నిరాకరిస్తుంది
టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి
నల్లగొండ,సెప్టెంబర్12(జనంసాక్షి):
విదేశాలు తిరిగే కేసీఆర్, మంత్రులకు రైతులను పరామర్శించే తీరికలేకుండా పోయిందని పీసీసీ అధ్యక్షడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. శనివారం యాదగిరిగుట్ట మండలం సాదువెల్లిలో ఆత్మహత్య చేసుకున్న రైతు కరుణాకర్ కుటుంబాన్ని పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల ఆత్మహత్యలను గుర్తించేందుకు ప్రభుత్వం నిరాకరిస్తోందన్నారు. ఇప్పటివరకు ఒక్క రైతును ప్రభుత్వం ఆదుకోలేదని ఆయన విమర్శించారు. రైతుల కుటుంబాలకు కాంగ్రెస్ అండగా ఉంటుందని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. జిల్లాలో ఆత్మహత్యలు చేసుకున్న భిక్షమయ్యగౌడ్, కసిరెడ్డి నారాయణరెడ్డి కుటుంబాలకు రూ.లక్ష ఆర్థికసాయన్ని ఆయన అందజేశారు.