రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికే మద్దతు ధర పెంపు.

తొర్రూర్ 11జూన్ (జనంసాక్షి )ప్రధాని నరేంద్ర మోడీ 8 ఏళ్ల సుపరిపాలన పూర్తయిన సందర్భంగా బిజెపి చేపట్టిన సేవా సుపరిపాలన మరియు గరీభ్ కళ్యాణ్ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు బీజేపీ తొర్రూరు శాఖ అధ్యక్షుడు పల్లె కుమార్ ఆధ్వర్యంలో తొర్రూర్ పట్టణంలోని పలు వార్డుల్లో కరపత్రాలు పంపిణీ చేసి విస్తృత ప్రచారం చేయడం జరిగింది.కేంద్ర ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా కార్యదర్శి పరుపాటి రాం మోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ 8ఏళ్ళ పాలన లో పేదల కోసం అనేక పథకాలు అమలు చేసి పేదల పక్షపాతిగా మారింది అని తెలిపారు.ఇటీవల రైతుల సంక్షేమం కోసం 14రకాల పంటల కు కనీస మద్దతు ధర 95రూ”నుంచి 565రూ”వరకు పెంచింది అని తెలిపారు.రైతుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఈ మద్దతు ధర పెంపు ఉపయోగపడుతుంది అని తెలిపారు.రైతుల కష్టాలను చూసి ప్రధాని నరేంద్ర మోడీ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు అని, ప్రధాని నిర్ణయాన్ని ధేశ వ్యాప్తంగా రైతులు చాలా ఆనందంగా స్వాగతిస్తూ ఆనందోత్సాహాలతో సంబురాలు చేసుకుంటుంటే ప్రతి పక్షాలు ఓర్వ లేక అసత్యాలు ప్రచారం చేసి రాజకీయ లబ్ది పొందాలని కుట్రలకు పాల్పడడం సరికాదని అన్నారు.ఈనెల 13వ తేది న మానుకోట జిల్లా కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ 8ఏళ్ళ పాలన విజయాల పై బిజెపి సభ ఏర్పాటు చేసింది అని ఈ కార్యక్రమంలో బిజెపి ఫైర్ బ్రాండ్, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగిస్తారని బీజేపీ రాష్ట్ర, జిల్లా, మండల,బూత్ కమిటీ నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి ఎస్సీ మోర్చ మహా బాద్ పార్లమెంట్ ఇంఛార్జి అలిసేరి రవిబాబు, బీజేపీ అర్బన్ ప్రధాన కార్యదర్శి పైండ్ల రాజేష్,బీజేవైఎం అర్బన్ అధ్యక్షుడు కాగు నవీన్,వినయ్ శర్మ, సిహెచ్ శ్రీనివాస్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.