రైతుల దిగ్భంధనంలో ఢిల్లీ

– మోదీ మొండివైఖరికి నిరసనగా బైటాయింపు

– కొత్త వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలి

– అన్నదాతల డిమాండ్‌

దిల్లీ,నవంబరు 30(జనంసాక్షి):కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయచట్టాలకు నిరసనగా పంజాబ్‌,హర్యాణా రైతులు చేస్తున్న ఆందోలనలు కొనసాగుతూనే ఉన్నాయి.ఎటువంటి షరతులు లేని చర్చలకు తాము అంగీకరిస్తామని భారతీయ కిసాన్‌ మంచ్‌ అధ్యక్షుడు బుటా సింగ్‌ అన్నారు. ఈ తరహా సమావేశానికి కేంద్రం అంగీకరించిట్లు తమకు తెలిసిందన్నారు. ‘మాకు లేఖ వచ్చిన వెంటనే మేం కలుస్తాం. మాకు పరిష్కారం కావాలి’ అని సింగ్‌ వెల్లడించారు. నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతుల ఆందోళన తీవ్రమవుతోన్న తరుణంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌, ¬ం మంత్రి అమిత్‌ షాతో భేటీ అయ్యారు. ఈ క్రమంలో చర్చలకు మార్గం సుగమమైనట్లు తెలుస్తోంది. కాగా, 12 గంటల్లో కేంద్ర మంత్రులు భేటీ కావడం ఇది రెండో సారి. ఇదిలా ఉండగా, నిరసనలో పాల్గొంటున్న రైతులను ఇదివరకే కేంద్రం చర్చలకు ఆహ్వానించింది. అయితే, సరిహద్దులో ఉండకుండా దిల్లీ శివారులోని బురాడిలో ఉన్న మైదానానికి వెళ్లి ఆందోళన కొనసాగిస్తే వెంటనే చర్చలు జరుపుతామని అమిత్‌ షా సూచించారు. చర్చలు జరిపేందుకు షరతులు పెట్టడం అవమానకరమని రైతు సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బురాడికి వెళ్లేది లేదని, సరిహద్దులోనే చర్చలు జరగాలని తేల్చిచెప్పారు. లేకపోతే దిల్లీకి చేరుకునే ఐదు రహదారులను దిగ్బంధిస్తామని హెచ్చరించిన నేపథ్యంలో కేంద్ర మంత్రులు అత్యవసరంగా భేటీ అయ్యారు.కాగా దేశ రాజధాని సరిహద్దుల్లో రైతుల ఆందోళన తీవ్రమవుతున్న తరుణంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌.. ¬ంమంత్రి అమిత్‌ షాతో భేటీ అయ్యారు. ఈ ఉదయం షా నివాసానికి చేరుకున్న తోమర్‌ రైతుల నిరసనపై ¬ంమంత్రితో చర్చించారు. 12 గంటల్లో కేంద్రమంత్రులు భేటీ కావడం ఇది రెండోసారి. ఆదివారం రాత్రి భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో కేంద్రమంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌, తోమర్‌ సమావేశమైన విషయం తెలిసిందే. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులను కేంద్రం చర్చలకు ఆహ్వానించింది. అయితే సరిహద్దుల్లో ఉండకుండా దిల్లీ శివారులోని బురాడిలో ఉన్న మైదానానికి వెళ్లి ఆందోళన కొనసాగిస్తే వెంటనే చర్చలు జరుపుతామని అమిత్‌ షా సూచించారు. కాగా.. దీనిపై రైతు సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్చలు జరిపేందుకు షరతులు పెట్టడం అవమానకరమని విమర్శించారు. బురాడీకి వెళ్లేదే లేదని, సరిహద్దుల్లోనే చర్చలు జరగాలని తేల్చి చెప్పారు. లేదంటే దిల్లీకి చేరుకునే మొత్తం అయిదు రహదారులను దిగ్బంధిస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రులు హుటాహుటిన భేటీ అయ్యారు.

ఆందోళన నడుమే ప్రార్థనలు..

ఇదిలా ఉండగా.. ‘చలో దిల్లీ’ పేరుతో రైతులు చేపట్టిన ఆందోళన ఐదో రోజుకు చేరింది. దిల్లీ సరిహద్దుల్లోని సంఘ, టిక్రీ రహదారులపై వేలాది మంది రైతులు శాంతియుతంగా ఆందోళన సాగిస్తున్నారు. సోమవారం గురునానక్‌ జయంతిని పురస్కరించుకుని టిక్రి రహదారిపై పంజాబ్‌ రైతులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ప్రసాదాలు పంచుకున్నారు.