రైతుల పట్ల బ్యాంకుల వ్యవహారశైలి ఇబ్బందిగా ఉంది

5

మంత్రి హరీశ్‌

హైదరాబాద్‌ సెప్టెంబర్‌ 14(జనంసాక్షి):

బ్యాంకర్లు, ఇన్సూరెన్సు కంపెనీల నిర్లక్ష్యం వల్ల రైతులు నష్టపోతున్నారని మంత్రి హరీష్‌రావు అన్నారు. బ్యాంకుల వ్యవహార శైలి ప్రభుత్వాన్ని, రైతులను ఇబ్బంది పెట్టేలా ఉందన్నారు. రైతుల్లో ఆత్మవిశ్వాసం కల్పించాల్సిన బాధ్యత అందరికి ఉందని ఆయన అన్నారు. సంగారెడ్డిలోని మెదక్‌ జిల్లా కలెక్టరేట్‌ లో బ్యాంకర్లు, వ్యవసాయ శాఖ అధికారులతో మంత్రులు హరీష్‌రావు, పోచారం శ్రీనివాస రెడ్డి సవిూక్ష జరిపారు.కొన్ని బ్యాంకులు నిబంధనలు ఉల్లంఘించి రైతుల నుంచి వడ్డీలు వసూలు చేస్తున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. రైతుల దగ్గర నుంచి వసూలు చేసిన వడ్డీలను వాపసు చేయాలని ఆయన ఆదేశించారు. రైతులకు బ్యాంకులు సహకరించకుంటే బ్యాంకులకు ప్రభుత్వం సహకరించదని మంత్రి హెచ్చరించారు. బ్యాంకులు వ్యవహారశైలి మార్చుకోవాలని, రైతులను ఇబ్బందులు పెట్టొద్దని మంత్రి పోచారం చెప్పారు.

జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.