రైతుల ప్రయోజనాల కోసమే ఢల్లీికి వచ్చాం
తక్షణం ధాన్యం కొనుగోళ్లపై ప్రకటన చేయాలి
వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి డిమాండ్
న్యూఢల్లీి,డిసెంబర్20(జనం సాక్షి ): రైతుల ప్రయోజనం కోసమే తాము ఢల్లీికి వచ్చామని, రాజకీయం చేయడానికి రాలేదని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. కేంద్ర మంత్రి తక్షణమే తమకు సమయం ఇవ్వాలని కోరారు. వానాకాలం ధాన్యం కొనుగోలుపై స్పష్టత కోసమే ఢల్లీి వచ్చామని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి సమయం ఇచ్చేవరకు వేచిచూస్తామన్నారు.వీలైనంత త్వరగా సమయం ఇచ్చి తమ గోడు వినాలన్నారు. తమను నిరీక్షించేలా చేయడమంటే తెలంగాణ రైతులను అవమానించడమే అన్నారు. మంత్రులు జగదీశ్ రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎంపీలు కేకే, నామానాగేశ్వర రావుతో కలిసి మంత్రి నిరంజన్ రెడ్డి న్యూఢల్లీిలో విూడియాతో మాట్లాడారు. గత యాసంగిలో కేంద్ర ఇచ్చిన టాª`గ్గంªట్ ఎంత, కొన్నది ఎంత అని ప్రశ్నించారు. కేంద్రం ఇచ్చిన టాª`గ్గంªట్‌ను పెంచాలని గతంలోనే
కోరామన్నారు. వరి ధాన్యం కోసం ఆరు వేలకుపైగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. వానాకాలంలో తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం 42 లక్షల మెట్రిక్ టన్నుల టార్గెట్ ఇచ్చిందని, 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామని చెప్పారు. కొనుగోలు కేంద్రాల్లో మరో 12 నుంచి 15 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉందన్నారు. ఇంకా కొన్ని జిల్లాల్లో వరి కోతలే జరగలేదని, జనవరి 15 వరకు వరి కోతలు ఉంటాయని, 5 లక్షల ఎకరాల్లో వరి కోతకు సిద్ధంగా ఉందని చెప్పారు. నేటితో కేంద్రం ఇచ్చిన వరి ధాన్యం కొనుగోలు టాª`గ్గంªట్ పూర్తవుతుందని చెప్పారు. రాబోయే ధాన్యాన్ని కేంద్రం కొంటుందో లేదో చెప్పాలని, ఎంత ధాన్యం వస్తే అంత కొంటామని కేంద్రం రాతపూర్వకంగా చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రంతో ఇప్పటికే చేదు అనుభవాలు ఉన్నాయన్నారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అయోమయంలో ఉన్నారని చెప్పారు. వానాకాలం కొనుగోళ్లతో యాసంగిని ముడిపెడుతూ మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇతర దేశాలకు ఎగుమతిపై రాష్టాల్రకు అధికారం ఉండదని చెప్పారు. వానాకాలంలో 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యమే కొంటామన్నారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనాలని తాము కోరామని చెప్పారు. బియ్యం మిల్లింగ్ తరువాత తరలించాల్సిన బాధ్యత కేంద్రానిదేనని స్పష్టం చేశారు.