రైతుల భూములు లాక్కుని సూటు బూటు బాబులకు
– మోదీ సర్కారుపై రాహుల్ ధ్వజం
రాయ్‌పూర్,జూన్16(జనంసాక్షి): రైతుల భూములు లాక్కోని బడాబాబులకు అందజేసేందుకు మోది సర్కార్ వువ్విళ్లురుతుందని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో చేపట్టిన పాదయాత్ర రెండోరోజూ కొనసాగింది. జాంజ్‌గిర్-చంపా జిల్లా నుంచి రాహుల్ పాదయాత్ర ప్రారంభించారు. 10 కిలోవిూటర్లు సాగే ఈ పాదయాత్రలో గిరిజనులు, రైతులను కలిసి భూసేకరణ చట్టం గురించి రాహుల్ మాట్లాడనున్నారు. సారధి గ్రామం నుంచి ప్రారంభించిన రాహుల్ పాదయాత్రలో పార్టీ సీనియర్ నేతలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పాదయాత్ర అనంతరం దాబ్రా గ్రామం వద్ద ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో రాహుల్ ప్రసంగించనున్నారు. ఆయన వెంట స్థానిక కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. గిరిజనులకు ప్రభుత్వ పథకాలు అందడం లేదని రాహుల్ ఆరోపిస్తున్నారు. వారికి అండగా ఉంటామన్నారు.