రైతుల సంక్షేమ కోసం ఉచితంగా 24 గంటల విద్యుత్ -వ్యవసాయ,మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.
గద్వాల నడిగడ్డ, జులై 28 (జనం సాక్షి);
రైతుల సంక్షేమం కోసమే ఉచితంగా 24 గంటల విద్యుత్తు ఇస్తూ రైతు ప్రభుత్వంగా పనిచేస్తుందని రాష్ట్ర వ్యవసాయ,మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.శుక్రవారం ఐజ మండలం ఉప్పల గ్రామంలో నిర్మించిన 33/100 కే.వి సబ్ స్టేషన్ ను అలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహంతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణలో కరంటు కోత, కొరత ఉండదని, ప్రతి రెండు, మూడు గ్రామాలకు ఒక సబ్ స్టేషన్ నిర్మాణం జరిగితే నాణ్యమైన విద్యుత్ అందించడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో విద్యుత్ రంగానిది కీలకపాత్ర, అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ అడిగిన ప్రతి చోట విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణాలకు అనుమతులు ఇస్తున్నారని అన్నారు. 24 గంటల విద్యుత్ సరఫరా లేకుంటే పరిశ్రమలు, వర్తక, వాణిజ్యాలు, గృహావసరాలు, వ్యవసాయం మూలంగా కోట్లాది మందికి ఉపాధి లభించేది కాదన్నారు.
వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ, ఐటీ, పారిశ్రామిక, వర్తక వ్యాపారాలు గాని, చేతివృత్తులలో ఉపాధి రంగాలలో ఇంత పెద్దఏత్తున అందుబాటులో ఉండడం, ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ముందుచూపుతో చేసిన పని ఇది అని, భారత దేశంలో తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ మొదటిస్థానంలో ఉన్నదని అన్నారు. తెలంగాణ దరిదాపులలో కూడా ఇతర రాష్ట్రాలు లేవన్నారు.
రాష్ట్రంలో విద్యుత్ వినియోగాన్ని బట్టే అంతగా ప్రజల అవసరాలు తీరుతున్నాయని, అన్ని పనులు జరుగుతున్నాయని అభివృద్ధి సూచికలో ప్రధానమైనది విద్యుత్ అన్నారు. రైతులకు ఉచితంగా 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందజేస్తూ రైతు ప్రభుత్వముగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు. ఇంతేగాక వ్యవసాయానికి సాగు నీరు అందిస్తూ భూములు సస్యశ్యామలం చేస్తున్నట్లు తెలిపారు. వనపర్తి, గద్వాల, నాగర్ కర్నూలు జిల్లాలలో తక్కువ వర్షపాతం నమోదయింది ,అయినా వర్షాధార పంటలయిన పత్తి, మొక్కలకు ఎలాంటి ఇబ్బంది లేదని, నెల రోజులు ఈ సారి కాలం ఆలస్యమయిందని, రైతులు వ్యవసాయ అధికారుల సూచన మేరకు సాగుచేయాలని, విద్యుత్ వాడకంలో జాతీయస్థాయిలో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని విద్యుత్ వినియోగం ఎక్కువ కావడం వల్ల రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నారాయణపేట మహబూబ్నగర్ లో వర్షాలు బాగా పడినప్పటికీ వనపర్తి ,నాగర్ కర్నూల్, గద్వాలలో వర్షపాతం తక్కువగా ఉందని అన్నారు. ప్రస్తుతం వరి పంట వేయడానికి ఆలస్యమైనందున ఇతర పంటలైన మేట్ట పంటలు వేసి రైతులు అభివృద్ధి చెందవచ్చు అని తెలిపారు. వ్యవసాయాధికారుల సూచనలు పాటించి రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలని మంత్రి సూచించారు
ఈ కార్యక్రమం లో అలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహం, ఆర్ డి ఓ చంద్రకళ, డి ఈ లక్ష్మణ్, సంబందిత అధికారులు తదితరులు తదితరులు పాల్గొన్నారు.