రైతు ఆత్మహత్య
వాజేడు: ధర్మారం గ్రామానికి చెందిన ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. మిర్చి వ్యాపారి బెదిరింపులతోనే పాణ్యం నరసింహారావు (48) ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. మిర్చి వ్యాపారిపై చర్యలు తీసుకొని రైతు కుటుంబాన్ని ఆదుకోవాలంటూ ధర్మారం గ్రామస్థులు మృతదేహంతో రాస్తారోకో చేపట్టారు.