రైతు ఇంట్లో దోపీడీ
ఖమ్మం: జిల్లాలోని భద్రాచలం మండలం గన్నేరుగొయ్యలపాడులోని ఓ రైతు ఇంట్లో దోపిడీ జరిగింది. ఈ రోజు ఉదయం తుపాకులతో ఐదుగును దుండగులు రైతును బెదిరించి 15 తులాల బంగారం, 3కిలోల వెండి, రూ 10 వేల నగదును దోచుకెళ్లారు. బాధితుని ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.