రైతు ఇంట్లో దోపీడీ
ఖమ్మం : భద్రాచలం మండలం గన్నేరుగోయ్యలపాడులోని ఓ రైతు ఇంట్లో దోపిడీ జరిగింది. ఈ తెల్లవారుజామున నక్సలైట్లమని తుపాకులతో పలువురుదుండగులు రైతును బెదిరించి 15 కాసుల బంగారం 3 కిలోల వెండి రూ. 10 వేల నగదును దోచుకెళ్లారు.బాధితుని ఫిర్యాదుతో పోలిసులు కేసు నమోదు చేసి వివరాలు సేకరించారు.