*రైతు ఉత్పత్తిదారుల కంపెనీలను బలోపేతం చేయాలి.
జిల్లా వ్యవసాయ అధికారి విజయభాస్కర్ .
చిట్యాల సెప్టెంబర్26 (జనంసాక్షి) రైతు ఉత్పత్తిదారుల కంపెనీలను బలోపేతం చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి విజయభాస్కర్ అన్నారు. సోమవారం ఎస్.ఎఫ్.ఏ.సి సహకారముతో ఏఎఫ్.సి ఇండియా అధ్వరయములో రైతు ఉత్పత్తిదారుల కంపెనీ , వ్యవసాయ విస్తరణ అధికారులు మండల వ్యవసాయ అధికారులు , బ్యాంకు అనుబంధ సంస్థలు,సి.బీ. బి. ఓ లకు ఈక్విటీ గ్రాంట్ , క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్స్ ఫై అవగాహనా కార్యక్రమము చిట్యాల మండలంలోని జూకల్ రైతు వేదికలో నిర్వహించారు.ఈ కార్యక్రమములో ముఖ్యఅతిథిగా జిల్లా వ్యవసాయ అధికారి విజయ భాస్కర్ పాల్గొని మాట్లాడుతూ రైతు ఉత్పత్తి దారుల కంపెనీ లు ఆర్ధికంగా నిలదొక్కుకోవాలంటే ఈ రొండు స్కీంలు ఉపయోగపడతాయని కాబట్టి ఈ అవకాశాని జిల్లాలో ఉన్న రైతు ఉత్పత్తిదారుల కంపెనీస్ వినోయోగించుకొనేలా రైతు ఉత్పత్తి దారులకంపనీలు బలోపేతం కావాలని కోరారు. దీనికి గాను మా డిపార్ట్మెంట్ సహకారం ఉంట్టుందని తెలియజేస్తు ప్రతి వ్యవసాయ విస్తరణ మరియు మండల వ్యవసాయ అధికారులు రైతు ఉత్పత్తిదారుల కంపెనీల సమావేశాలకు హాజరై వారికి వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించిన సలహాలు సూచనలు అందించాలని కోరారు అనంతరం రైతు ఉత్పత్తిదారుల ప్రతినిధులు వారి అనుభవాలను అధికారుల దృష్టికి తెస్తూ సహకారం అందించాలని కోరారు .ఈ కార్య క్రమములో జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్. తిరుపతి , కె .వి.కె వెటర్నరీ అధికారి , జిల్లా వెటర్నరీ అధికారి సధనందం ఫిషరీస్ అధికారి అవినాష్ తోపాటు ఏ.ఎఫ్.సి అధికారి ప్రసన్న పది రిసోర్స్ పర్సన్ ఎస్ నాగబ్రహ్మచారి అసిస్టెంట్ డైరెక్టర్ అఫ్ అగ్రికల్చర్ అధికారి శ్రీనివాసరాజు, మండల వ్యవసాయ అధికారులు రఘుపతి, రైతులు పాల్గొన్నారు