రైతు కుటుంబాలకు ముస్లింల ఔదార్యం

2

– 27 లక్షల విరాళాల సేకరణ

హైదరాబాద్‌ అక్టోబర్‌3(జనంసాక్షి):

కరువు కోరల్లో కొట్టుమిట్టాడుతూ బలవన్మరణాలకు పాల్పడుతున్న  రైతులకు అండగా నిలుస్తామంటూ ముస్లింములు ముందుకొచ్చారు. రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం చేసేందుకు తలో చేయివేస్తూ తమ ఔదార్యాన్ని చాటారు. మహారాష్ట్రలోని లాతూర్‌, ఉస్మానాబాద్‌ జిల్లాలోని రైతులను ఆదుకునేందుకు 27లక్షల రూపాయల విరాళాలను సేకరించారు. కరువు కోరాల్లో ఉన్న మరట్వాడా రైతులను ఆదుకుంటామని సేవా అనే సంసథ ప్రకటించింది. అక్టోబర్‌ 5న ఈ ప్రాంతాల్లో పర్యటించిన రైతులకు ఆర్థిక సాయాన్ని అందించనున్నట్లు సేవా అధ్యక్షుడు యూసుఫ్‌ అబ్రహాని తెలిపారు. రైతేలను అండగా నిలిచందుకు వందలాది ముస్లిం మత పెద్దలు , ఇతరులు సంసథలో చేరి విరాళాలు సేకరిస్తున్నారు. ఇబ్బందుల్లో ఉన్న రైతులకు లక్ష రూపాయలు అందజేయనున్నట్లు హాందివాలీ మసీద్‌ మౌలానా ఐజాజ్‌ కాశ్మీరీ ఇమాం తెలిపారు. ఈ సందర్భంగా సేవా అధ్యక్షుడు అబ్రహని మాట్లాడుతూ మేబై ప్రజలు రైతుల కోసం ముందుకు రావడం గర్వంగా ఉందని, అల్లాహ్‌ వారికి అండగా ఉండాలని కోరుకుంటున్నానని, విరాళాల ద్వారా వచ్చిన డబ్బును ఆపదలో ఉన్న రైతులకు అందజేస్తామని తెలిపారు. కరువు కారణంగా మహారాష్ట్రలో వందల మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నం పెట్టే రైతన్నలను ఆదుకోవడం మన నైతిక బాధ్యతన్నారు.