రైతు కూలీలకు సురక్షిత వాతావరణం కల్పించాలి

ఐ ఓ ఎల్ ప్రతినిధి దగ్మర్ వాల్టర్
నల్గొండ బ్యూరో. జనం సాక్షి
పత్తి వ్యవసాయ క్షేత్రం, జిన్నింగ్ మిల్లులలో పని చేసే కూలీ లు సురక్షిత,ఆరోగ్య కరమైన వాతావరణం లో పని చేసేలా కృషి చేయాలని
ఐ. ఎల్.ఓ డైరెక్టర్ డగ్మర్ వాల్టర్ అన్నారు.సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఉదయాదిత్య భవన్ లో ఐ. ఎల్.ఓ,కార్మిక శాఖ ఆద్వర్యం లో పత్తి పరిశ్రమ లో పని చేసే కూలీలు హక్కులు బాధ్యతలు పై వ్యవసాయ, మార్కెటింగ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ,విద్యా శాఖ,పరిశ్రమలు,ఫ్యాక్టరీ స్,రైతు సంఘాలు,కార్మిక సంఘాలు,ఎన్. జి.ఓ.ల ప్రతినిధులతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆమె ,స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ,కార్మిక శాఖ అదనపు కమిషనర్ గంగాధర్ తో కలిసి జ్యోతి ప్రజ్వల న చేసి కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పత్తి సంబంధిత వ్యవసాయ క్షేత్రం లు,కాటన్ మిల్లు ల లో పని చేసే కూలీ లు,అసంఘటిత కార్మికులు ,వెట్టి చాకిరి,బాల కార్మికులు లేని,మహిళా కూలీ లు పట్ల వివక్ష లేకుండా ఆరోగ్యకరంగా పని చేసేలా. వారి హక్కులు,బాధ్యతలు పై అవగాహన కల్పించేలా తెలంగాణ రాష్ట్రం లో నల్గొండ, ఆదిలాబాద్,జోగు లాంబ గద్వాల,వరంగల్ రూరల్ నాలుగు జిల్లాలో ప్రాజెక్ట్ అమలు చేస్తున్నట్లు ఆమె తెలిపారు.సంబంధిత శాఖలు,ఎన్. జి.ఓ.లు,వ్యవసాయ,రైతు సంఘాలు,కార్మిక సంఘాలు ఈ ప్రాజెక్ట్ వలన ఒకే ప్లాట్ ఫారం మీదికి వచ్చినట్లు, సహకారం,సమన్వయ దృక్పథం పని చేయటానికి వీలు జరుగుతుందని అన్నారు.జిల్లాలో గత కొంతకాలంగా జరిగిన కార్యక్రమాలు,వివిధ శాఖల అధికారులు,రైతు,కార్మిక సంఘాల ప్రతినిధులు తాము చేస్తున్న కృషిని వివరించారు.
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ జిల్లా లో పత్తి ప్రధాన పంట అని,జిల్లాలో 6,35,664 ఎకరాలలో 3,03,755 మంది రైతులు పత్తి సాగు చేస్తున్నారని,జిల్లాలో 26 జిన్నింగ్ మిల్లులు ఉన్నాయని,2018 నుండి కార్మిక శాఖ ఆధ్వర్యంలో వర్క్ షాప్ లు నిర్వహించినట్లు తెలిపారు.ఈ సమావేశం లో కార్మిక శాఖ ఉప కమిషనర్ రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

తాజావార్తలు