రైతు ప్రయోజనాలను కాపాడాలి.
గుంటూరు, జూలై 28: నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నీటి విడుదల విషయంలో హైకోర్టు నుంచి వచ్చిన తీర్పు సమర్థనీయం కాదు. వీటిపై ప్రభుత్వం న్యాయపోరాటం చేసి, డెల్టా, నాగార్జునసాగర్ ఆయకట్టు రైతుల ప్రయోజనాలు కాపాడలని, తెలుగుదేశంపార్టీ జిల్లా అధ్యక్షుడు, చిలకలూరిపేట ఎమ్మెల్యే పత్తిపాడు టి. పుల్లారావు డిమాండ్ చేశారు. టిడిపి జిల్లా కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హైకోర్టు తీర్పులొచ్చి పదిరోజులు గడుస్తున్నా నేటి వరకు ప్రభుత్వం స్పందిచకపోవడం దారుణమన్నారు. దీనివలన సిరులు పండిన భూములు బీడులుగా మారే ప్రమాదం వుందన్నారు. పంటవిరామం కళిరైతులు అడుగులు వేయకుండా ప్రభుత్వం నాగార్జునసాగర్ నుంచి తక్షణం సాగునీరు విడుదల చేసి నారుమడులు పోసుకొనేలా చేయలన్నారు. పోతిర్ డ్పిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంచి శ్రీశైలం నీటి మట్టాన్ని పెంచి, వైయస్‌రాజశేఖర్ రెడ్డి డెల్టా ప్రాంతానికి తీరని ద్రోహం చేశారని పొన్నూరు ఎమ్మెల్యే డి. నరేంద్ర కుమార్ తీవ్ర ఆరోపణలు చేశారు. బ్రిటీష్ కాలం నుంచి కృష్ణా నీటి హక్కులు పొందుతున్న డెల్టా రైతులకు ద్రోహం చేసిన వైయస్‌ను ఈ ప్రాంతం ప్రజలు ఎప్పటికీ క్షమించరని స్పష్టం చేశారు. రైతాంగం సంక్షభంలో కొట్టుమిట్లాడుతుండే జిల్లాకు చెందిన వ్యవసాయశాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, బ్రహ్మాండంగా ఉపన్యాసాలు ఇస్తూ టోల్‌ఫ్రీ నెంబర్లు అంటున్నారని ఎద్దేవా చేశారు. అసలు ఎనిమిదేళ్ళ మంత్రిగా ఉన్న ఆయన జిల్లాకు ఏమి చేశారని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే జియాఉద్దీన్, తెలగు దేశం పార్టీ కార్యదర్శి మన్నవ సుబ్బారాదు జిల్లా నాయకులు దాసరి రాజా, చిట్టా బత్తిన చిట్టిబాబు, దామచర్ల శ్రీనివాసరావు కస్తూరి హన్మంతరావు, ఎమ్‌క్రిష్ణారావు, రూబెన్, ఆర్.సాయి, సి ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.