రైతు బంధు ఇచ్చేదెన్నడో! నంగునూరు, జూన్11(జనంసాక్షి):
ఈ సీజన్లో రైతు బంధు ఇచ్చేదెన్నడో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చెయ్యాలని
టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి దేవులపల్లి యాదగిరి ప్రశ్నించారు.శనివారం నంగునూరులో విలేకర్లతో మాట్లాడారు.వానాకాలం పంటల సాగు సీజన్ త్వరలో ప్రారంభం కానున్న వేళ ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు ఇచ్చే తేదీని ప్రకటించకపోవడం ఏంటని ప్రశ్నించారు.ఇలా ఆలస్యం చేయడం వల్ల రైతులు అప్పుల కోసం వ్యాపారస్తుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.నిరుడు మే నెలలోనే నిర్ణయం ప్రకటించిన సర్కార్.. జూన్ 15వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లో నగదు జమచేసిందన్నారు. జూన్ పదో తేదీని కటాఫ్‌గా నిర్ణయించి అప్పటి వరకు పాసుపుస్తకాలు ఉన్నవారికి రైతుబంధు సాయం అందించారు.
ఇప్పటికే రావలసిన రైతు బందు ఆలస్యంతో రైతులు ఆందోళనలో ఉన్నారని మండిపడ్డారు.పంపిణీ ఎప్పుడన్న విషయమై ఇంకా నిరీక్షణ చేయించకుండా
తక్షణమే వారి ఖాతాలలో డబ్బులు జమచెయ్యాలని డిమాండ్ చేశారు. కార్యక్రమములో రాగుల కనకయ్య , చెలికాని యాదగిరి,అనరాజు నాగరాజు,దాసరి కిషన్,ఉల్లి బాలయ్య,పాల్గొన్నారు.