రైతు భరోసా యాత్రలో పాల్గొన్న కిసాన్ కాంగ్రెస్ జిల్లా చైర్మన్ సురేందర్ రెడ్డి

జనంసాక్షి, మంథని : తెలంగాణా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రైతుల సమస్యలు ఎక్కడికక్కడే పేరుకు పోయాయని.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతుల సమస్యలను అన్నిటిని పరిష్కరిస్తుందని, వ్యవసాయానికి ఉచితంగా 24 గంటలు కరెంటు ఇస్తామని రైతులకు భరోసా కల్పించడం లక్ష్యంగా ఆదిలాబాద్ జిల్లా నుంచి బుధవారం తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా రైతు భరోసా యాత్ర కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ రైతు భరోసా యాత్ర లో పెద్దపల్లి జిల్లా కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ ముస్కుల సురేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అజీమ్ ఖాన్, కాంగ్రెస్ నాయకులు పరశువేన మోహన్, ఎండి ఐసన్ తదితరులు పాల్గొన్నారు.