రైతు సమస్యలపై 1న చలోఢిల్లీ

కరీంనగర్‌,అక్టోబర్‌24(జ‌నంసాక్షి): రైతుల సమస్యలు, డిమాండ్ల సాధనకు నవంబరు 1న ‘చలో దిల్లీ’ కార్యక్రమం చేపట్టినట్లు అఖిలభారత కిసాన్‌ సభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముడుపు ప్రభాకర్‌రెడ్డి చెప్పారు. ఢిల్లీ జంతర్‌మంతర్‌ వద్ద మహాధర్నా చేపడుతున్నామని అన్నారు. ఇందుకు అన్నిజిల్లాల్లోని రైతులను సవిూకరిస్తున్నామని మంగళవారం నాడిక్కడ తెలిపారు. ఈ మహాధర్నాకు రైతులంతా తరలిరావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పత్తికి గిట్టుబాటు ధర ఇవ్వాలని రైతులు కోరుతున్నా సర్కార్‌ పట్టించుకోవడం లేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సమస్యలు పట్టించుకోక పోవడంతోనే దేశంలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కార్పోరేటర్లు, వ్యాపారవేత్తలకు వత్తాసు పలికి కొన్ని కోట్ల రూపాయలు వారికి ధారాదత్తం చేస్తోందన్నారు. రైతుల విషయంలో కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. కవిూషన్లు వచ్చే పథకాలు ప్రవేశపెట్టి రాష్టాన్న్రి దివాలా తీస్తున్నారని ఆరోపించారు. అభివృద్ధిలో అగ్రస్థానంలో ఉన్నామని చెప్పుకొంటున్న తెలంగాణ ముఖ్యమంత్రి అసలు అప్పుల్లో మొదటిస్థానంలో ఉందని తెలిపారు.