రైల్వే ¬టళ్ల కేసులో లాలూకు సిబిఐ సమన్లు

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌7(జ‌నంసాక్షి): ఇప్పటికే గడ్డి కుంభకోణంలో విచారణ ఎదుర్కొంటున్న లాలూ మరిన్ని చిక్కులు ఎదుర్కొంటున్నారు. రాష్టీయ్ర జనతాదళ్‌ అధినేత, బిహార్‌ మాజీ సీఎం లాలూ ప్రసాద్‌ యాదవ్‌, ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్‌కు సీబీఐ గురువారం సమన్లు జారీ చేసింది. రైల్వే ¬టళ్ల కేటాయింపులో అవకతవకలకు పాల్పడిన విషయంలో ఆయన ఈ సమన్లు అందుకున్నారు. సెప్టెంబరు 11న లాలూ సీబీఐ అధికారుల ఎదుట హాజరుకావాల్సి ఉండగా.. మరుసటి రోజు తేజస్వీని అధికారులు విచారించనున్నారు. 2006లో రైల్వేశాఖలో నిర్వహించిన టెండర్లలో అవతవకలు జరిగాయంటూ లాలూపై గతంలో ఆరోపణలు వచ్చాయి. ఆ సమయంలో లాలూ రైల్వేమంత్రిగా పనిచేశారు. పూరీ, రాంచిలోని రైల్వేస్‌లో ¬టళ్లు నడుపుకొనేందుకు ప్రైవేటు వ్యక్తులకు లాలూ అక్రమంగా టెండర్లు కేటాయించినట్లు సీబీఐ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే జులై 7న లాలూ ఇళ్లలో సీబీఐ సోదాలు చేపట్టింది. లాలూ కుటుంబానికి చెందిన 12 ప్రాంతాల్లో సోదాలు చేపట్టి.. పలు కీలకమైన పత్రాలను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. తేజస్వి యాదవ్‌ ఇటీవలి వరకు నితీష్‌ మంత్రివర్గంలో డిప్యూటి సిఎంగా పనిచేశారు.