రైల్వే ప్రాజెక్టుల్లో ఇంత నిర్లక్ష్యమా
ప్రభుత్వ వాటా జమ చేయకపోవడంతోనే ఆలస్యం
మండిపడ్డ జనసేనాని పవన్ కళ్యాణ్
అమరావతి,ఫిబ్రవరి10(జనంసాక్షి): రైల్వే ప్రాజెక్టులు పూర్తిపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. గురువారం విూడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ వాటా జమ చేయకపోవడమే అసలు సమస్య అని అన్నారు. కోటిపల్లి ` నరసాపురం రైల్వే లైన్ ఎప్పటికి పూర్తవుతుందని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులు ఎందుకు జాప్యం అవుతున్నాయో కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఇచ్చిన వివరణతో ఇక్కడి వైసీపీ ప్రభుత్వ వైఖరి అందరికీ తేటతెల్లమైందని తెలిపారు. అభివృద్ధిలో భాగమైన రైల్వే లైన్ల నిర్మాణం, విస్తరణలపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత మాత్రం చిత్తశుద్ధి లేదని జనసేనాని మండిపడ్డారు. రైల్వే, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో పూర్తి కావల్సిన ఈ ప్రాజెక్టులు… రాష్ట్ర ప్రభుత్వ అలసత్వం వల్లే జాప్యం అవుతున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా సమకూర్చాల్సిన నిధులను విడుదల చేయకపోతే పనులు ఎలా సాగుతాయని ప్రశ్నించారు. కీలకమైన రైల్వే లైన్లు అసంపూర్తిగా ఉండిపోయాయన్నారు. కోటిపల్లి ? నరసాపురం రైల్వే లైన్ అనేది ఎప్పటి నుంచో వింటున్నదే అని చెప్పారు. ఈ ప్రాజెక్టుకు 25? వాటా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని… ఆ మొత్తాన్ని ఇవ్వకపోవడంతో ముందుకు వెళ్ళడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.358 కోట్లు ఇస్తే పనులు మొదలవుతాయని ఆయన తెలిపారు. రైల్వే లైన్ పూర్తి చేస్తే ఉభయగోదావరి జిల్లాలకు ఎంతో ప్రయోజనం ఉంటుందని… దీనిపై ప్రభుత్వానికి శ్రద్ధ లేదని విమర్శించారు. అలాగే నడికుడి ? శ్రీకాళహస్తి ప్రాజెక్టుకు రూ.1351 కోట్లు, కడప,బెంగళూరు లైనుకు రూ.289 కోట్లు, రాయదుర్గం`తుముకూరు లైనుకు రూ.34 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చాలని డిమాండ్ చేశారు. నిధులు ఇవ్వరు, భూసేకరణ కూడా చేయరన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యత విస్మరిస్తే రైల్వే ప్రాజెక్టులు ఎలా పూర్తవుతాయని ప్రశ్నించారు. మౌలిక వసతుల అభివృద్ధి ఏ విధంగా సాధ్యం అవుతుందన్నారు. ఇలాగైతే ఈ లైన్లు ఎప్పటికి పూర్తవుతాయని జనసేన అధినేత నిలదీశారు. ªుశాఖ రైల్వే జోన్ ప్రకటన అయినా అది కార్యరూపం దాల్చే విధంగా చేయడంలో వైసీపీ ఎంపీలు విఫలం అవుతున్నారన్నారు. రైల్వే ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేయించలేరని… ప్రకటన అయిన జోన్‌ను ముందుకు తీసుకువెళ్ళేందుకు చిత్తశుద్ధితో కృషి చేయలేని తెలిపారు. రైల్వే లైన్ల అంశాలను ముఖ్యమంత్రికి వివరించి రాష్ట్ర వాటా నిధులు విడుదల చేయించాల్సిన బాధ్యత వైసీపీ ఎంపీలపై ఉందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.