రైళ్లు అగే స్టేషన్ల పెంపు
సికింద్రాబాద్ : ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని పలు రైళ్లకు కొత్తగా వివిధ స్టేషన్లలో హాల్ట్ సదుపాయాన్ని తక్షణ వర్తింపుతో కల్పించనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే సీఆర్వో సాంబశివరావు తెలిపారు. నెం. 12740 /12739 సికింద్రాబాద్ -విశాఖపట్నం గరీబ్‌రధ్ ఇకపై తాడేపల్లిగూడెంలో నిలుపుతారు. అదే విధంగా నెం.17213/17214 నర్సాపూర్ -నాగర్‌సోల్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు వీరవాసరం, కైకలూరు స్టేషన్లలో హాల్ట్ సదుపాయం కల్పించారు.