రొహింగ్యాలతో దేశభద్రతకు ముప్పట!

– భారత్‌ వింత వాదన

-ఇండియా వైఖరిని ఖండించిన ఐరాస

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌ 14,(జనంసాక్షి): రోహింగ్యా ముస్లింలతో దేశ భద్రతకు ముప్పు ఉందని కేంద్రం ఉప్రీంకు వివరించింది. మయన్మార్‌ నుంచి వచ్చిన రొహింగ్యా ముస్లింలపై కేంద్ర ప్రభుత్వం కఠిన వైఖరిని కొనసాగిస్తోంది. వీరు శరణార్థులుగా భారతదేశంలో ఉండకూడదని సుప్రీంకోర్టుకు గురువారం తెలిపింది. రొహింగ్యా వలసదారులు మన దేశ భద్రతకు ముప్పు అని తెలిపింది. వారిని దేశం నుంచి పంపించేందుకు తగిన ప్రణాళికపై ఆలోచన జరుగుతోందని పేర్కొంది. /రిహింగ్యా ముస్లింల అగ్ర నేతలు పాకిస్థాన్‌లోని ఉగ్రవాద సంస్థలతో సంబంధాలను ఏర్పరచుకున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. కేంద్ర ¬ం మంత్రిత్వ శాఖ కూడా రొహింగ్యా ముస్లింల వల్ల దేశ భద్రతకు విఘాతం కలుగుతుందని పేర్కొంది. రొహింగ్యా ముస్లింలను తిరిగి మయన్మార్‌కు పంపించేందుకు భారతదేశం చేస్తున్న ప్రయత్నాలను ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి చీఫ్‌ తప్పుబట్టారు. దీనిని భారతదేశం ఖండించింది. దేశ భద్రతను విస్మరించలేమని స్పష్టం చేసింది.