రోజుకో గంట మాత్రమే విద్యుత్‌ కోత!

హైదరాబాద్‌, ఆగస్టు 3 :రోజుకో గంట మాత్రమే విద్యుత్‌ కోత.. సహకరించాలని వినియోగదారులకు విద్యుత్‌ శాఖ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటివరకు 3 గంటల పాటు విద్యుత్‌ కోతను కుదించి గంటసేపు మాత్రమే విద్యుత్‌ కోత అమలులో ఉంటుందని చెప్పారు. ఎన్‌టిపిసి, ఆర్‌టిపిపిల్లో విద్యుత్‌ ఉత్పత్తి పెరగడంతో పై నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.
‘గ్రూప్‌-ఎ’ మాదాపూర్‌, గోల్కొండ, గన్‌రాక్‌, హకీంపేట, ఎసి గార్డ్స్‌, అత్తాపూర్‌, లంగర్‌హౌస్‌, మచ్చబొల్లారం, ఆసిఫ్‌నగర్‌, లేక్‌వ్యూ, మైత్రివనం, ఎల్లారెడ్డిగూడ, శంషాబాద్‌, తుర్కయాంజల్‌, తాండూరు, ఉప్పరపల్లి, ఎండిపల్లి, మామిడిపల్లి, ఇబ్రహింపట్నం, నందనవనం, చంపాపేట, వనస్థలిపురం, తదితర ప్రాంతాల్లో ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు కరెంటు కోత విధించనున్నట్టు వివరించారు.
‘గ్రూప్‌-బి’ ఇఎన్‌టి ఆసుపత్రి, ఫలక్‌నుమా, గోషామహల్‌, హైదర్‌గూడ, ఐడిపిఎల్‌ ఐఐసిటీ, జేమ్స్‌ స్ట్రీట్‌, ఉస్మానియా ఆసుపత్రి, ఉస్మానియా విశ్వవిద్యాలయం, యాకుత్‌పురా, మోండా మార్కెట్‌, ఉప్పల్‌, మౌలాలి, నాచారం, కొత్తపేట, మోహన్‌నగర్‌, బండ్లగూడ, ఆటోనగర్‌, హయత్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు విద్యుత్‌ కోత అమలులో ఉంటుందని చెప్పారు.
‘గ్రూప్‌-సి’ అయ్యప్పసొసైటీ, బన్సీలాల్‌పేట, బేగంపేట, చంచల్‌గూడ, చిలకలగూడ, ఫిల్మ్‌నగర్‌, గ్రీన్‌లాండ్స్‌, సంజీవయ్యపార్కు, సంతోష్‌నగర్‌, కొంపల్లి, సుభాష్‌ నగర్‌, ఉషా ముళ్లపూడి, విజయనగర్‌కాలనీ, బాచుపల్లి, సూరారం, జీడిమెట్ల, మదీనాగూడ తదితర ప్రాంతాల్లో ఉదయం 11 నుంచి 12 గంటల వరకు విద్యుత్‌ కోత ఉంటుందని చెప్పారు.
‘గ్రూప్‌-డి’ లాలాగూడ, లుంబినిపార్కు, ఎల్‌వి ప్రసాద్‌ ఆసుపత్రి, మలక్‌పేట, మోతిమహల్‌, మూసారాంబాగ్‌, నారాయణగూడ, నిమ్స్‌, ప్రశాంతినగర్‌, పబ్లిక్‌ గార్డెన్‌, సుల్తాన్‌బజార్‌, సాలార్‌జంగ్‌, టోలిచౌక్‌, మల్కాజ్‌గిరి, ఆనంద్‌బాగ్‌, సైనిక్‌పురి, కుషాయిగూడ, తదితర ప్రాంతాల్లో మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట వరకు విద్యుత్‌ సరఫరా ఉండబోదని చెప్పారు.
‘గ్రూప్‌-ఇ’ బతుకమ్మకుంట, కుందన్‌బాగ్‌, జూబ్లీహిల్స్‌, శ్రీనగర్‌కాలనీ, సీతాఫల్‌మండి, బాలాజీనగర్‌, కెపిహెచ్‌బి, చందానగర్‌, నానక్‌రాంగూడ, గచ్చిబౌలి, కొత్తగూడ, ల్యాంకోహిల్స్‌, అయ్యప్ప సొసైటీ తదితర ప్రాంతాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు విద్యుత్‌ కోత అమలులో ఉంటుందని అధికారులు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.