రోజురోజుకూ షాక్ ఇస్తున్నా బంగారం, వెండి ధరలు
బంగారం ధరలు రోజురోజుకూ షాక్ ఇస్తున్నాయి. రానున్న రోజుల్లో తులం పసిడి ధర రూ.90 వేల మార్క్ దాటే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితుల నేపథ్యంలో గోల్డ్‌కు డిమాండ్ పెరిగిపోతోంది. దాన్ని సురక్షితమైన పెట్టుబడిగా భావించడమే ఇందుకు కారణం. మరోవైపు సెంట్రల్ బ్యాంకులు సైతం నిల్వల కోసం భారీగా బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. ద్రవ్యోల్బణం, కరెన్సీ హెచ్చుతగ్గుల వంటి అంశాలూ పసిడి ధర పెరిగేందుకు దోహదం చేస్తున్నాయి.
బంగారం, వెండి ధర..
మంగళవారం (18-02-2025) ఉదయం 06:30 గంటల సమయానికి దేశరాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.79,560 ఉండగా.. 24 క్యారెట్ల తులం పసిడి ధర రూ.86,780గా ఉంది. కిలో వెండి నిన్నటి ధరలతో పోలిస్తే రూ.100 తగ్గి రూ.1,00,400కు చేరుకుంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.79,410 ఉండగా.. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.86,630 వద్ద కొనసాగుతోంది. ఇక వెండి విషయానికి వస్తే తెలుగు రాష్ట్రాల్లో కిలోకు రూ.100 తగ్గి రూ.1,07,900కు చేరింది. కాగా, 2025లో బంగారం, వెండి ధరలు మరింత పెరిగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.
ప్రధాన నగరాల్లో బంగారం (22, 24 క్యారెట్ల) ధరలు ఇవే..
- ముంబై- రూ.79,410, రూ.86,630
- కోల్‌కతా- రూ.79,410, రూ.86,630
- చెన్నై- రూ.79,410, రూ.86,630
- విజయవాడ- రూ.79,410, రూ.86,630
- భువనేశ్వర్- రూ.79,410, రూ.86,630
- వరంగల్- రూ.79,410, రూ.86,630
- సోలాపూర్- రూ.79,410, రూ.86,630
- హైదరాబాద్- రూ.79,410, రూ.86,630