రోడ్డు దాటుతుండగా వ్యాన్ ఢీకొని బాలుడి మృతి
చాంద్రయణగుట్ట, జనంసాక్షి: ఉప్పుగూడలోని శివాజినగర్‌లో డీసీఎం వ్యాన్ ఢీకొని ఓ చిన్నారి మృతి చెందాడు. రెహ్మాన్ అనే 12 ఏళ్ల బాలుడు పాఠశాల బస్సు కోసం రోడ్డు దాటుతుండగా వేగంగా దూసుకువచ్చిన వ్యాన్ ఢీకొంది. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు వ్యాన్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.