రోడ్డు ప్రమాదంలో బమ్మెర వాసి

వాంకిడి (జనంసాక్షి): వాంకిడి మండలం బమ్మెరకు చెందిన ముక్కెర తిరుపతి గౌడ్‌(40) కరీంనగర్‌ మండలం మొగ్దూంపూర్‌లో ట్రాక్టర్‌ ఢీకొని మరణించాడు. మానకొండూర్‌ మండలం ఈదులగట్టెపల్లి జరిగే బంధువుల పెద్దకర్మకు ద్వియక్రవాహనంపై గురువారం ఉదయం బయలుదేరిన తిరుపతి ఎలిగేడ్‌ మండలం ముప్పిరితోటలో అత్తగారింటికి వెళ్లాడు. అక్కడినుంచి భార్య సుజాతతో కలిసి బైక్‌పై ఈదులగట్టెసల్లికి వెళ్లుండగా మొగ్దుంపూర్‌లో ట్రాక్టర్‌ డ్రైవర్‌ అజాగ్రత్తగా వీరిని డీకొట్టాడు. తిరుపతి అక్కడిక్కడే మరణించాడు. సుజాతకు తీవ్ర గాయలయ్యాయి. స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారమిచ్చారు. మృతుడికి ఇద్దరు కుమారులున్నారు. సంఘటనా స్థలాన్ని పోలీసులకు సమాచారమిచ్చారు. మృతుదికి ఇద్దరు కుమారులున్నారు. సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు.