రోడ్డు ప్రమాదంలో యువకుని దుర్మరణం
వరంగల్ ఈస్ట్, అక్టోబర్ 15(జనం సాక్షి)
వరంగల్ నగరంలోని అండర్ రైల్వే గేట్ కరీమాబాద్ ప్రాంతానికి చెందిన ఓగిలిశెట్టి గోపి మహేశ్వరిల కుమారుడు నిఖిల్(22) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. ఈ మేరకు కుటుంబ సభ్యులు శనివారం తెలిపారు. షాపింగ్ నిమిత్తం హనుమకొండకు కారులో వెళ్లిన నిఖిల్ తో పాటు కొందరు స్నేహితులు హనుమకొండలోని రోహిణి ఆసుపత్రి సమీపంలో రోడ్డు డివైడర్ కు కారు తాకడం తో గోపికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ మేరకు చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు బంధువులు వివరించారు. ఓకిలిశెట్టి గోపి కుటుంబంది కరీమాబాద్ అయిన ప్రస్తుతం గోపాలస్వామి గుడి వద్ద ఉంటున్నట్టు తెలిసింది. ఒక్కగానొక్క కొడుకు నిఖిల్ మృతి చెందడంతో గోపి దంపతులతో పాటు బంధువులు స్థానికులు బోరుణ విలపించారు.