రోడ్ల మరమ్మతులను వెంటనే చేపట్టాలి : గట్ల రమాశంకర్

సూర్యాపేట టౌన్(జనంసాక్షి):పట్టణంలో ధ్వంసమైన రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని తెలంగాణ జనసమితి రాష్ట్ర కమిటి సభ్యులు గట్ల రమాశంకర్ అన్నారు.బుధవారం ధ్వంసమైన రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని కోరుతూ ఆ పార్టీ పట్టణ నాయకులతో కలిసి మున్సిపల్ కమీషనర్ కు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో రోడ్లన్నీ అధ్వాన్నంగా ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు.అయినా అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదని విమర్శించారు.సూర్యాపేట నియోజక వర్గంలో అభివృద్ధి గురించి గొప్పలు చెప్పుకునే మంత్రి పట్టణంలోని రోడ్లను పరిశీలించాలని కొరారు.ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎం.మల్లయ్య మాట్లాడుతూ ద్వంసమైన రోడ్లపై ద్విచక్ర వాహనదారులు, పాదచారులు ఎన్నో ఇబ్బందులను ఏదుర్కొంటున్నారని చెప్పారు.యువజన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు నారబోయిన కిరణ్ మాట్లాడుతూ పట్టణ శివారు వార్డుల్లో పరిస్థితి దయనీయంగా ఉందన్నారు.పట్టణ అధ్యక్షులు బందన్ నాయక్  మాట్లాడుతూ అన్ని వార్డుల్లో దోమల మందు పిచికారీ చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్టీ సెల్ పట్టణ కన్వీనర్ దొన్వాన్ సతీష్ , యువజన సమితి నాయకులు కృష్ణ, అక్తర్ , చందు అఖిల్ తదితరులు పాల్గొన్నారు.