రోళ్లు పగులగోడుత్నున్న రోహిణి

5

– వడదెబ్బకు విలవిల

– పిట్టల్లా రాలుతున్న జనం

హైదరాబాద్‌ మే 24(జనంసాక్షి):

భానుడి ప్రతాపానికి తెలుగు రాష్గాలు నిప్పుల కొలి మిని తలపిస్తున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న ఎండల తీవ్రతకు జనం అల్లాడుతున్నారు. ఉత్తర, వాయువ్య దిశల నుంచి వేడిగాలుల వల్ల పలు ప్రాం తాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చిన్నారులు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అత్యవసరమైతేనే ప్రజ లు బయటకు రావాలని సూచిస్తున్నారు. వడగా ల్పుల ధాటికి ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఆది వారం ఒక్కరోజే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్గాల్లో సుమారు 265 మంది మృత్యువాత పడ్డారు.

ఆంధ్రప్రదేశ్‌లో 165 మంది మృతి

ఆంధ్రప్రదేశ్‌లో వడదెబ్బకు ఉదయం నుంచి 150 మంది మృతి చెందారు. శ్రీకాకుళం జిల్లాలో ఐదు గురు, విజయనగరం జిల్లాలో 15 మంది, విశాఖ జిల్లాలో 24 మంది, తూర్పుగోదావరిలో ఐదుగురు, పశ్చిమగోదావరిలో 8 మంది,

కృష్ణా జిల్లాలో 15 మంది, గుంటూరు జిల్లాలో 15 మంది, ప్రకాశం జిల్లాలో 28 మంది, నెల్లూరు జిల్లాలో 28 మంది, అనంతపురం జిల్లాలో 8 మంది, కడప జిల్లాలో 8 మంది, చిత్తూరు జిల్లాలో నలుగురు, కర్నూలు జిల్లాలో ఇద్దరు చొప్పున మృతిచెందారు.. ఆంధ్రప్రదేశ్‌లో మరో 48గంటల పాటు ఎండల తీవ్రత కొనసాగే అవకాశముందని విశాఖలోని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈరోజు తూర్పుగోదావరి జిల్లా తునిలో అత్యధికంగా 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

తెలంగాణలో 100 మంది మృతి

తెలంగాణ రాష్ట్రంలో వడ దెబ్బతో ఆదివారం 100 మంది మృతిచెందారు. కరీంనగర్‌ జిల్లాలో 22 మంది, నల్గొండ జిల్లాలో 16 మంది, ఖమ్మం జిల్లాలో 14 మంది, వరంగల్‌ జిల్లాలో 12 మంది, మెదక్‌ జిల్లాలో 8 మంది, మహబూబ్‌నగర్‌ జిల్లాలో 9 మంది, నిజామాబాద్‌లో ఐదుగురు, ఆదిలాబాద్‌ జిల్లాలో 8 మంది, హైదరాబాద్‌ ఒకరు, రంగారెడ్డి జిల్లాలో ఇద్దరు మృతిచెందారు. ఖమ్మం, నల్గొండ, రామగుండంలో 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వడగాల్పులకు తాళలేక జనం ఇళ్లలోంచి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు.