రోహింగ్యా ప్రాంతాల్లో ఆంగ్ సాన్ సూకీ పర్యటన

రాఖైన్: మయన్మార్ నేత ఆంగ్ సాన్ సూకీ ఇవాళ రాఖైన్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. రోహింగ్యా ముస్లింలపై ఊచకోత జరుగుతున్న ప్రాంతాన్ని ఆమె సందర్శించడం ఇదే మొదటిసారి. రోహింగ్యాల సమస్యపై అంతర్జాతీయంగా నిరసనలు వెల్లువెత్తిన తర్వాత సూకీ స్పందించారు. రాఖైన్ రాజధాని సిత్వేతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఆమె ఇవాళ పర్యటించనున్నారు. గత ఆగస్టు నుంచి సుమారు నాలుగు లక్షల మంది రోహింగ్యా తెగ ముస్లింలు ఆ దేశాన్ని విడిచి వెళ్లిపోయారు. రోహింగ్యాలు భారీ హింసకు దిగడంతో అక్కడి మిలిటరీ వాళ్లను అణిచివేస్తున్నది. మిలిటరీ చర్యలకు భయపడిన రోహింగ్యాలు దేశం విడిచి పారిపోతున్నారు. వాళ్లంతా బంగ్లాదేశ్‌కు వలస వెళ్తున్నారు.