రో’హిట్‌’

చెలరేగిన శర్మ
39 బంతుల్లో 79 పరుగులు
పోరాడి ఓడిన పంజాబ్‌
నాల్గో స్థానంలో ముంబయి జట్టు
ముంబయి ఏప్రిల్‌ 29 (జనంసాక్షి) :
ముంబయిలో సోమవారం జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌పై ముంబయి ఇండియన్స్‌ జట్టు నాలుగు పరుగుల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్‌ చేసిన ముంబయి జట్టు 174 పరుగులు సాధించింది. ఓపెనర్‌ బ్యాట్స్‌మెన్‌ స్మిత్‌ 32 బంతుల్లో 33 (3ఫోర్లు, సిక్స్‌) పరుగులు చేశాడు. చావ్లా బౌలింగ్‌లో షాట్‌ కొట్టబోయి మిల్లర్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. సచిన్‌ 10 బంతులు మాత్రమే ఆడి 9 పరుగులు చేసి ఔటయ్యాడు. తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన కార్తీక్‌ 19 బంతులు ఆడి 25 పరుగులు చేసి గోని బౌలింగ్‌లో వికెట్‌ కోల్పోయాడు. రోహిత్‌ శర్మ వచ్చీ రావడంతోనే రెచ్చిపోయాడు. 30 బంతుల్లో 79 (6 ఫోర్లు, 6 సిక్స్‌లు) పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. పొలార్డ్‌ అతడికి సహకరిస్తూ 21 బంతుల్లో 20 పరుగులు చేశాడు. 175 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌ నాలుగు పరుగులు చేయాల్సి ఉండగా చేతులెత్తేసింది. ముంబయి బౌలర్ల ధాటికి పంజాబ్‌ జట్టు కుప్ప కూలింది. ఓపెనర్‌ బ్యాట్స్‌మెన్‌ మణిదీప్‌ సింగ్‌ 8 బంతుల్లో 9 పరుగులు మాత్రమే చేసి మలింగ బౌలింగ్‌లో ఔటయ్యాడు. మార్ష్‌ కూడా వెంటనే పెవిలియన్‌కు చేరుకున్నాడు. 12 బంతుల్లో 10 పరుగులు చేసి జాన్సన్‌ బౌలింగ్‌లో పొలార్డ్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన వోహ్రా 2 బంతుల్లో 1 పరుగు చేసి వెనుదిరిగాడు. హుస్సే కాస్త నిలకడగా ఆడి 18 బంతుల్లో 34 పరుగులు చేశాడు. మిల్లర్‌ కాస్త రెచ్చిపోయి ఆడినా ఫలితం లేక పోయింది. 34 బంతుల్లో 56 పరుగులు చేసి జాన్సన్‌ బౌలింగ్‌లో చిక్కాడు. గురుకీరత్‌ సింగ్‌ 2, అజార్‌ మహ్మద్‌ 9, చావ్లా 12, కుమార్‌ 24 పరుగులు చేయగా గోని డకౌట్‌ అయ్యాడు. ముంబయి బౌలర్లలో హర్భజన్‌ సింగ్‌ 3, మిచెల్‌ జాన్సన్‌, ఓజా, కులకర్ణి రెండేసి వికెట్లు తీశారు. మలింగ ఒక వికెట్‌ పడగొట్టారు
ముంబై ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌ :
స్మిత్‌ (సి) (సి) డేవిడ్‌ మిల్లర్‌ (బి) పీయూష్‌ చావ్లా 33(4×3, 6×1), సచిన్‌ (బౌల్డ్‌) ప్రవీణ్‌ కుమార్‌ 9(4×2), దినేష్‌ కార్తిక్‌ (బౌల్డ్‌) గోని 25(4×2, 6×1), రోహిత్‌ శర్మ నాటౌట్‌ 79(4×6, 6×6), కీరన్‌ పోలర్డ్‌ నాటౌట్‌ 20(4×1, 6×1)

ఎక్స్‌ట్రాలు : 8 (బైస్‌-0, వైడ్‌లు :4, నోబాల్‌-1, లెగ్‌ బై-3, ఫెనాల్టీ-0)మొత్తం : 174 (20 ఓవర్లలో 3 వికెట్లకు) రన్‌ రేట్‌ : 8.70వికెట్ల పతనం : 1-11(సచిన్‌ 2.4), 2-43(దినేష్‌ కార్తిక్‌ 7.4), 3-86(స్మిత్‌ 12.2)పంజాబ్‌ బౌలింగ్‌ : ప్రవీణ్‌ కుమార్‌ 4-0-24-1, అజర్‌ మహమూద్‌ 4-0-32-0, పర్విందర్‌ అవానా 4-0-16-0, గోని 4-0-43-1, పీయూష్‌ చావ్లా 2-0-24-1, డేవిడ్‌ హస్సీ 2-0-32-0, నాయర్‌ 2-0-15-1

కింగ్స్‌ ఎలవన్‌ పంజాబ్‌ ఇన్నింగ్స్‌ :మన్‌దీప్‌ సింగ్‌ (బౌల్డ్‌) మలింగ 9(4×2), మార్ష్‌ (సి) కీరన్‌ పోలర్డ్‌ (బి) ప్రగ్యాన్‌ ఓజా 10(4×1), మనం వోహ్ర (సి) కీరన్‌ పోలర్డ్‌ (బి) జాన్సన్‌ 1, డేవిడ్‌ హస్సీ (సి) జాన్సన్‌ (బి) ప్రగ్యాన్‌ ఓజా 34(4×5, 6×1), డేవిడ్‌ మిల్లర్‌ (సి) సచిన్‌ (బి) జాన్సన్‌ 56(4×1, 6×5), అజర్‌ మహమూద్‌ (సి) దినేష్‌ కార్తిక్‌ (బి) హర్భజన్‌ సింగ్‌ 9(4×1), గోని (సి) దినేష్‌ కార్తిక్‌ (బి) హర్భజన్‌ సింగ్‌ 0, పీయూష్‌ చావ్లా (సి) అంబటి రాయుడు (బి) ధావల్‌ కులకర్ణి 12(6×1), ప్రవీణ్‌ కుమార్‌ (సి) స్మిత్‌ (బి) ధావల్‌ కులకర్ణి 24(4×1, 6×2), అవానా నాటౌట్‌ ఎక్సాట్రాలు : 13 (బైస్‌-4, వైడ్‌లు : 6, నోబాల్‌-1, లెగ్‌ బై-3, ఫెనాల్టీ-0)మొత్తం : 170 (20 ఓవర్లలో 10 వికెట్లకు) రన్‌ రేట్‌ : 8.50

వికెట్ల పతనం : 1-12(మన్‌దీప్‌ సింగ్‌ 1.6), 2-16(మనం వోహ్ర 2.5), 3-55(మార్ష్‌ 6.1), 4-76(డేవిడ్‌ హస్సీ 8.4), 5-79(గుక్రాత్‌ సింగ్‌ 9.3), 6-110(అజర్‌ మహమూద్‌ 13.2), 7-111(గోని 13.6), 8-132(పీయూష్‌ చావ్లా 16.5), 9-149(డేవిడఖ మిల్లర్‌ 17.5), 10-170(అవానా 19.6)ముంబై బౌలింగ్‌ : మిచెల్‌ జన్సాన్‌ 4-0-29-2, మలింగ 4-0-39-1, కులకర్ణి 4-0-44-2, ఓజా 3-0-22-2, హర్భజన్‌ సింగ్‌ 4-0-14-3, కీరన్‌ పోలర్డ్‌ 1-0-15-0

తాజావార్తలు