రోహిత్ ఆత్మహత్యపై న్యాయవిచారణకు ఆదేశం
న్యూఢిల్లీ,జనవరి22(జనంసాక్షి): హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలపై కేంద్ర ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించింది. రోహిత్ మృతికి దారి తీసిన పరిస్థితులు, యూనివర్సిటీలోని పరిణామాలపై విచారణకు ఆదేశిస్తున్నట్లు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ మంత్రి స్మృతీ ఇరానీ శుక్రవారం ప్రకటించారు. ఈ అంశంపై జ్యుడిషియల్ కమటీ విచారణ జరిపి మూడు నెలల్లో నివేదిక సమర్పించనున్నట్లు తెలిపారు. కుమారుడిని కోల్పోయిన రోహిత్ తల్లితో ఫోన్ లో మాట్లాడిన స్మృతీ ఇరానీ.. తన సంతాపాన్ని తెలిపారు. అలాగే విద్యా రంగంలో సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించేందుకు ఓ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నట్లు మానవ వనరుల శాఖ ప్రకటించింది. దళిత విద్యార్థుల పట్ల వివక్ష మూలంగానే రోహిత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని విమర్శలు వస్తున్న నేపథ్యంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.ఇదిలా వుండగా రోహిత్ తల్లిని స్మృతి పరామర్శించారు. రోహిత్ మృతిపై తప్పకుండా న్యాయం చేస్తామని కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ హావిూ ఇచ్చారు. ఈమేరకు ఇవాళ రోహిత్ తల్లి, సోదరునితో ఫోన్‌లో మాట్లాడారు. కాగా, కేంద్ర మంత్రులు స్మృతీ ఇరానీ, బండారు దత్తాత్రేయ వల్లే రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడని అంబేద్కర్ విద్యార్థి సంఘం నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలపై కేంద్ర ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించింది. రోహిత్ మృతికి దారి తీసిన పరిస్థితులు, యూనివర్సిటీలోని పరిణామాలపై విచారణకు ఆదేశిస్తున్నట్లు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ మంత్రి స్మృతీ ఇరానీ శుక్రవారం ప్రకటించారు. ఈ అంశంపై జ్యుడిషియల్ కమటీ విచారణ జరిపి మూడు నెలల్లో నివేదిక సమర్పించనున్నట్లు తెలిపారు. కుమారుడిని కోల్పోయిన రోహిత్ తల్లితో ఫోన్ లో మాట్లాడిన స్మృతీ ఇరానీ.. తన సంతాపాన్ని తెలిపారు. లాగే విద్యా రంగంలో సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించేందుకు ఓ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నట్లు మానవ వనరుల శాఖ ప్రకటించింది. దళిత విద్యార్థుల పట్ల వివక్ష మూలంగానే రోహిత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని విమర్శలు వస్తున్న నేపథ్యంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.