రోహిత్ చనిపోవడానికి వీసీ, కేంద్ర మంత్రులదే బాధ్యత
హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో రోహిత్ ఆత్మహత్యపై తీవ్రంగా స్పందించారు రాహుల్. వీసీ, హెచ్ఆర్డీ మినిస్టర్ వైఖరి వల్లే ఓ స్టూడెంట్ చనిపోయాడు అని అన్నారు. కేంద్రమంత్రి, వీసీని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అన్యాయం బహిష్కరించటం వల్లే విద్యార్థులు ఆందోళనకు దిగారన్నారు. అభిప్రాయాలు వ్యక్తం చేసే స్వేచ్ఛ కూడా విద్యార్థులకు లేదా అని నిలదీశారు. దేశంలోని అన్ని వర్సిటీల్లో ఇలాంటి ఘటనలే జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.రోహిత్ చనిపోవడానికి వీసీ, కేంద్ర మంత్రులదే బాధ్యత . రాజకీయం చేయటానికి వర్సిటీకి రాలేదు. విద్యార్ధుల భావాలను వర్శిటీలు రాజకీయం చేయొద్దు.వర్శిటీల్లో పక్షపాత దోరణి మంచి కాదు.వర్శిటీల్లో పక్షపాత దోరణి మంచి కాదు. రోహిత్ మృతికి కారణమైన బాధ్యులను కఠినంగా శిక్షించాలి.విద్యార్థుల డిమాండ్లు న్యాయమైనవే.. వారితో ఏకీభవిస్తున్నా.రోహిత్ కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలన్నవిద్యార్ధుల డిమాండ్ సరైనదే.ఎప్పుడు ఎలాంటి అవసరం వచ్చిన మీరు నన్ను కలవచ్చ.