రౖనా, హస్సీ వీర విహారం
–సన్‌రైజర్స్‌పై చెన్నై ఘన విజయం
–ఐపీఎల్-6లో కొనసాగుతున్న సూపర్‌కింగ్స్ హవా
–ప్లే ఆఫ్‌లో స్థానం ఖాయం
–సొంతగడ్డపై హైదరాబాద్‌కు తప్పని పరాభవం
హైదరాబాద్, మే 8 (జనంసాక్షి) :
సురేశ్‌రైనా, మైఖేల్ హస్సీ వీరవిహారంతో చెన్నై సూపర్ కింగ్స్ ఘన సాధించింది. నగరంలోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడ ియంలో నిర్వహించిన ఐపీఎల్-6, 54వ మ్యాచ్‌లో హైదరాబాద్ కెప్టెన్ సంగక్కర టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఆయన నిర్ణయం ఎంత తప్పో చెన్నై ఓపెనర్లు కొద్ది నిమిషాల్లోనే తేల్చి చెప్పారు. తొలి ఓవర్లలో స్టెయిన్ చురుకైన బంతులు విసిరి తక్కువ పరుగులే ఇచ్చినా వికెట్లు తీయలేకపోయాడు. ఓపెనర్లు మైఖేల్ హస్సీ, మురళీ విజయ్ పరుగుల వరద సృష్టించారు. 20 బంతుల్లో రెండు బౌండరీలు, మూడు సిక్సర్ల సాయంతో 29 పరుగులు చేసిన విజయ్ పెరీరా బౌలింగ్‌లో పార్థివ్ పటేల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ఫస్ట్‌డౌన్‌లో వచ్చిన రైనా బౌలర్లకు చుక్కలు చూపించాడు. హస్సీతో కలిసి స్కోర్‌బోర్డును ఉరకలెత్తించాడు. 42 బంతుల్లో ఐదు బౌండరీలు, నాలుగు సిక్సర్ల సాయంతో 67 పరుగులు చేసిన హస్సీ పెరీరా బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డయ్యాడు. నాలుగో స్థానంలో కెప్టెన్ ధోని మూడు బంతులను ఎదుర్కొని నాలుగు పరుగులే చేసి పెరీరా బౌలింగ్‌లోనే కిరణ్‌శర్మకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మంచి ఊపుమీదున్న రైనా సెంచరీ చేస్తాడని అంతా అనుకున్నారు. 52 బంతులను ఎదుర్కొన్న రైనా మూడు సిక్సర్లు, 11 బౌండరీలతో 99 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. రవీంద్రజడేజా ఆరు బంతుల్లో మూడు బౌండరీలతో 14 పరుగులు చేశాడు. చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. హైదరాబాద్ బౌలర్లలో స్టెయిన్ పొదుపుగా బౌలింగ్ చేసినా వికెట్లు సాధించలేకపోయాడు. పెరీరా ఒక్కడే మూడు వికెట్లు సాధించాడు. ఇషాంత్ శర్మ, కరణ్ శర్మ, అమిత్‌మిశ్రా, డారెన్ సామి భారీగా పరుగులు సమర్పించుకున్నారు. 224 పరుగుల భారీ విజయలక్ష్యంతో బరిలోకి దిగిన హైద రాబాద్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటి వరకు పరుగుల వరద సృష్టిస్తున్న శిఖర్‌ధావన్ స్వల్ప స్కోర్‌కే వెనుదిరిగాడు. టాప్ ఆర్డర్ మొత్తం క్యూ కట్టడంతో హైదరాబాద్‌కు భారీ పరాజయం తప్పలేదు. ధావన్ రనౌట్ కాగా, కెప్టెన్ సంగక్కర, విహారీ, స్యామీ అతడినే అనుసరించారు. పార్థివ్‌పటేల్ వేగంగా పరుగులు సాధిం చినా సహచరుల నుంచి తీడ్పాటు కరువైంది. 30 బంతుల్లో ఆరు బౌండరీలు, సిక్సర్‌తో 44 పరుగులు చేసిన పటేల్ మోహిత్ శర్మ బౌలింగ్‌లో విజయ్‌కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. బౌలింగ్‌లో మెరుపులు మెరిపించిన పేరిరా బ్యాట్‌తోనూ పర్వాలేదనిపించాడు. 13 బంతుల్లో రెండు సిక్సర్లు, బౌండరీతో 23 పరుగులు చేసి బ్రావో బౌలింగ్‌లో బద్రీనాథ్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. కరణ్‌శర్మ 33 బంతుల్లో మూడు బౌండరీలు, సిక్సర్‌తో 39 పరుగుల చేసి నాటౌట్‌గా నిలిచాడు. స్టెయిన్ ఒక్కడే రెండంకెల స్కోర్ సాధించగా మిగతా బ్యాట్స్‌మన్ 3, 3, 3, 7, 6 పరుగులకే ఔటయ్యారు. చెన్నై బౌలర్లలో మోహిత్ శర్మ, హోల్డర్, అశ్విన్, మోరీస్ తలా ఒక వికెట్ సాధించారు. హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 146 పరుగులు చేసింది. చెన్నై 77 పరుగుల భారీ ఆధిక్యంతో విజయం సాధిం చింది. మెరుపు ఇన్నింగ్స్‌తో చెన్నై గెలుపులో కీలక భూమిక పోషించిన సురేశ్‌రైనాకు మ్యాన్‌ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు దక్కింది. 20 పాయింట్లతో చెన్నై ప్లేఆఫ్ బెర్త్ ఖాయం చేసుకుంది.
చెన్నై సూపర్‌కింగ్స్:
బ్యాటింగ్ : హస్సీ (67) (బౌ) పెరెరా, మురళీ విజయ్(29) (క్యా) పటేల్ (బౌ) పెరెరా, రైనా(99) (నాటౌట్), ధోనీ(4) (క్యా) కరణ్ శర్మ (బౌ) పెరెరా, జడేజా(14) (నాటౌట్)
మొత్తం : 223/3 (20.0)
రన్‌రేట్ : 11.15
ఎక్స్‌ట్రాలు : 10 (బైస్-0, వైడ్‌లు-5, నోబాల్-3, లెగ్‌బైస్-2, పెనాల్టీ-0
వికెట్ల పతనం : 1-45(5.2), 2-178(17.2), 3-183(17.4)
హైదరాబాద్ బౌలింగ్: స్టెయిన్ 4-1-17-0, ఇషాంత్ శర్మ 4-0-66-0, పెరెరా 4-0-45-3, కరణ్ శర్మ 2-0-19-0
సన్ రైజర్స హైదరాబాద్:
బ్యాటింగ్ : సిఎ పటేల్(44) (క్యా)మురళీ విజయ్ (బౌ) మోహిత్ శర్మ, ధావన్(3) (రనౌట్) ధోనీ, సంగక్కర(3) (క్యా)మోరిస్ (బౌ) అశ్విన్, సమ్మీ(7) (క్యా) మోరిస్ (బౌ)మోహిత్ శర్మ, పెరెరా(23) (క్యా)బద్రీనాధ్ (బౌ) బ్రావో, శర్మ(39) (నాటౌట్), మిశ్రా(6) (రనౌట్) జడేజా, డేల్ స్టేయిన్(14) (క్యా) హుల్డర్ (బౌ) మోరిస్, ఇషాంత్ శర్మ(0) (నాటౌట్).
మొత్తం: 146/8 (20.0) రన్‌రేట్ : 7.30
ఎక్స్‌ట్రాలు : 4 (బైస్-0, వైడ్‌లు-4, నోబాల్-0, లెగ్‌బైస్-0, పెనాల్టీ-0
వికెట్ల పతనం : 1-11 (1.5), 2-46 (5.3), 3-55 (7.5), 4-62 (8.2), 5-64(8.6), 6-99(12.5), 7-110(15.2), 8-143(19.5)
చెన్నై బౌలింగ్ : మోహిత్ శర్మ 4-0-28-2, హూల్డర్ 3-0-26-0, అశ్విన్ 4-0-23-1, రైనా 1-0-4-1, మోరిస్ 2-0-24-1, బ్రావో 4-0-25-1, జడేజా 2-0-14-0