రౖల్వేస్టేషన్‌ తనిఖీ చేసిన డీఆర్‌ఎం

నిజామాబాద్‌:(బోధన్‌) రైల్వేష్టేషన్‌ను ఈ రోజు రైల్వే డీఆర్‌ఎం రాకేష్‌ ఆరుణ్‌ తనిఖీ చేశారు. స్టేషన్‌లోని సిగ్నలింగ్‌ వ్యవస్థ మౌలిక వసతులపై స్టేషన్‌ మేనేజర్‌ను అడిగి తెలుసుకున్నారు. బోదన్‌-నిజామాబాద్‌ మధ్య రైల్వేలైన్‌ను పరిశీలించటానికి ఆయన మోటరు ట్రాలీపై ప్రయాణించారు. ఈ రైల్వేలైనును ఆధునీకరించేందుకు ఈ పరిశీన చేపట్టామన్నారు. స్థానిక ప్రజా సంఘాలు, హమాలీలు రైల్వేస్టేషన్లలోని సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు.