రౖసెట్ డైరెక్టర్‌గా గిరిజాశంకర్
ఖమ్మం, జూలై 17: పట్టణ సమీపంలోని తరణిహాట్‌లో గల గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణాసంస్థ డైరెక్టర్‌గా గిరిజాశంకర్ నియమితులయ్యారు. గతంలో ఇక్కడ పనిచేసిన శ్రీధర్ పదవీవిరమణ పొందారు. ఆయన స్థానంలో కొత్తగూడెం స్టేట్‌బ్యాంకులో పని చేస్తున్న గిరిజాశంకర్‌ను నియమించారు. ఈ మేరకు ఆయన మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. గ్రామీణ ప్రాంతాల్లోని యువతీయువకులకు ఆసక్తి ఉన్న రంగాల్లో ఉచిత వసతి కల్పిస్తూ శిక్షణ ఇస్తున్నామన్నారు. ఇప్పటివరకు సంస్థ ఆధ్వర్యంలో 1749 మందికి 50 బృందాలుగా శిక్షణ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. నిరుద్యోగ యువతీయువకులకు స్వయం ఉపాధి కల్పించేందుకు ఇక్కడ పలు శిక్షణ తరగతులు ఇస్తున్నామన్నారు.