లంక గ్రామాల్లో ప్రజల ఆందోళన

నీటిలో మునగడంతో రాకపోకలకు అంతరాయం
అధికారుల పర్యవేక్షణ..కొనసాగుతున్న సహాయక చర్యలు
గుంటూరు,ఆగస్ట్‌17(జనం సాక్షి): కృష్ణమ్మ ఉగ్రరూపంతో ప్రకాశం బ్యారేజీ దిగువన ప్రస్తుతం కొల్లూరు, భట్టిప్రోలు మండలాల్లో 21 లంక గ్రామాలు ముంపు బారిన పడ్డాయి. ప్రస్తుతానికి ఇళ్లలోకి నీరు రాకున్న రోడ్లు, పొలాలు జలమయం అయ్యాయి. నది మధ్యలో ఉన్న పెదలంక, చింతల్లంక, సుగ్గునలంక, కనిగిరిలంక, ఈపూరులంక, చిలుమూరులంక, అన్నవరపులంక, కొత్తూరులంక గ్రామాలకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. చుట్టూ వరద నీరు చేరడంతో తాగడానికి మంచి నీరు కరువైంది. దీంతో ఆయా గ్రామాలకు పడవల సాయంతో తాగునీటి ప్యాకెట్లు, డబ్బాలను యుద్ధ ప్రాతిపదికన తరలిస్తున్నారు. కొల్లూరు, కొల్లిపర, భట్టిప్రోలు మండలాల నుంచి ఐదు వేల మందికి పైగా లంక గ్రామాల వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పశువులు, వంట చెరకు, మరికొంత వ్యవసాయ ఉత్పత్తులను ట్రాక్టర్లు, పడవలపై మండల కేంద్రాలకు తరలించుకుంటున్నారు. ప్రత్యేకంగా ఆరు పడవలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్డీవో చెప్పారు.ప్రకాశం బ్యారేజీ నుంచి శుక్రవారం ఏడున్నర లక్షలకు పైగా వరద నీటిని నదిలోకి వదిలి వేయడంతో కృష్ణమ్మ ఉప్పొంగి లంక గ్రామాలపై పడింది. లంక గ్రామాలకు రవాణా పూర్తిగా స్తంభించింది. దీంతో  కృష్ణాతీరంలోని లంక గ్రామాల ప్రజలు భయం గుప్పిట్లో బతుకుతున్నారు. ప్రకాశం బ్యారేజీ దిగువన ప్రస్తుతం కొల్లూరు, భట్టిప్రోలు మండలాల్లో 21 లంక గ్రామాలు ముంపు బారిన పడ్డాయి. రేప్లలె మండలంలోని పల్లిపాలెం వద్ద ప్రమాదకర పరిస్థితి నెలకొంది. విజయవాడ అమరావతి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మొత్తం 12 మండలాల్లోని 39 గ్రామాలు వరద ముంపునకు గురైనట్లుగా జలవనరుల శాఖ పేర్కొన్నది. లంక గ్రామాలను రాష్ట్ర మంత్రి మోపిదేవి వెంకటరమణరావు, బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌, ఎమ్మెల్యే డాక్టర్‌ మేరుగ నాగార్జున, జిల్లా కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌, ఆర్డీవో శ్యాంప్రసాద్‌ తదితరులు పర్యవేక్షించారు. లంక గ్రామాల్లో 18 మరబోట్లను అధికారులు సిద్ధం చేశారు. భట్టిప్రోలు మండలం చింతమోటు, పెదలంక, పెసర్లంక గ్రామాల నుంచి ఓలేరు వచ్చే మార్గం రోడ్డు వరద ఉధృతికి కోత పడటంతో అటు కూడా రవాణా స్థంభించింది కొల్లిపర మండలం లంక గ్రామాలు మొదలుకుని.. రేప్లలె మండలం లంకెవానిదిబ్బ వరకు అనేక చోట్ల కరకట్ట, ఏటి గట్లు గండ్లు పడటానికి సిద్ధంగా ఉన్నాయి.  గ్రామాలకు వెళ్లే రోడ్లన్నీ గండ్లు పడే పరిస్థితులు ఉండడంతో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి ప్రజలను అటువైపు వెళ్లకుండా నియంత్రిస్తున్నారు.రొయ్యల చెరువులు కట్టలు తెంచుకుని కృష్ణా కరకట్ట పై వరకు వరద ఉధృతి పెరుగుతుంది. ఈ ప్రాంతంలోనూ మంత్రి మోపిదేవి పర్యటించి ఇసుక మూటలను అటుగా పెట్టించే పనులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.చుట్టూ వరద నీరు చేరడంతో తాగడానికి మంచి నీరు కరువైంది. దీంతో ఆయా గ్రామాలకు పడవల సాయంతో తాగునీటి ప్యాకెట్లు, డబ్బాలను యుద్ధ ప్రాతిపదికన తరలిస్తున్నారు. కొల్లూరు, కొల్లిపర, భట్టిప్రోలు మండలాల నుంచి ఐదు వేల మందికి పైగా లంక గ్రామాల వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పశువులు, వంట చెరకు, మరికొంత వ్యవసాయ ఉత్పత్తులను ట్రాక్టర్లు, పడవలపై మండల కేంద్రాలకు తరలించుకుంటున్నారు. ప్రత్యేకంగా ఆరు పడవలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్డీవో చెప్పారు. రైతులు లంక భూముల్లో ఉన్న విద్యుత్‌ మోటార్లను, ఆయిల్‌ ఇంజన్లను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మత్సకారులు పడవల ద్వారా గ్రామస్థులను చేరవేస్తున్నారు. గింజుపల్లి వద్ద వాహనరాకపోకలు నిలిచిపోవడంతో పడవల ద్వారా ప్రయాణికులను చేరవేస్తున్నారు. వరదల వలన ఎక్కువ ప్రభావం గుంటూరు జిల్లా వైపున ఉన్న గ్రామాల పైనే పడుతోన్నది. మొత్తం 12 మండలాల్లోని 39 గ్రామాలు వరద ముంపునకు గురైనట్లుగా జలవనరుల శాఖ పేర్కొవది. కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌, జాయింట్‌ కలెక్టర్‌ ఏఎస్‌ దినేష్‌కుమార్‌ పర్యటిస్తోన్న సమయంలో వర్షం ఇబ్బంది పెట్టింది. పల్లపుప్రాంతాల్లో వేసిన వాణిజ్య పంటలు రెండు రోజుల క్రితమే నీటమునగటంతో వేరు కుళ్లి పనికిరాకుండా పోతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఆయా ప్రాంతాలను మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పరిశీలించారు.  పులిచింతల ప్రాజెక్టు పరిధిలోని ముంపు గ్రామాలైన కోళ్లూరు, పులిచింతల, గోపాలపురం, బోదనం, కేతవరం, కేతవరం తండా, చిట్యాల, చిట్యాలతండా ఎమ్మాజీగూడెం గ్రామాలు వరద గుప్పెట్లో చిక్కుకున్నాయి. బెల్లంకొండ మండలం ఎమ్మాజిగూడెం గ్రామంలో సగం గ్రామంలో నీటిలో మునిగిపోయింది. గృహాలు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి.
తీరప్రాంతంలోని మూడు ప్రాంతాలలో కట్టలు తెగిపోవటంతో కరకట్ట వెంబడి గ్రామాలలోని ప్రజలు భయాందోళన చెందుతున్నారు.