లక్ష్మీ సెహగల్‌ సేవలో ఆపూర్వం

నిజామాబాద్‌, జూలై 25 :లక్ష్మీసెహగల్‌ యువకులకు ఆదర్శనీయురాలని సిపిఎం పార్టీ సీనియర్‌ నాయకులు అంజ నారాయణ అన్నారు. ఈ సందర్భంగా నాలుగవ జోన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో లక్ష్మీ సెహగల్‌ మృతికి సంతాపం తెలిపారు. అనంతరం అంజ నారాయణ మాట్లాడుతూ, 1976లో భగత్‌సింగ్‌ ఏర్పాటు చేసిన సైనిక దళంలో ఆమె కెప్టెన్‌గా విధులు నిర్వహించారని గుర్తు చేశారు. స్వాతంత్య్ర సమరంలో ఆమె తనవంతు పాత్రను పోషించిందని అన్నారు. అదే విధంగా కమ్యూనిస్టు పార్టీలో చేరి పేదలకు ఎంతో కృషి చేశారని ఆయన కొనిడాయారు. ఆమె కుటుంబం పేద ప్రజల సంక్షేమం కోసమే ఎంతో కృషి చేసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో 4వ జోన్‌ కార్యదర్శి నూర్జహాన్‌, సత్యమ్మ, ఆశాబాయి, గోపిక, సునీత, సుజాత, భారతి తదితరులు పాల్గొన్నారు.