లక్ష్యం దిశగా ఎల్.ఇ.డి లైట్ల మార్పిడి
ఎల్.ఇ.డి లైట్లను చేపట్టిన అతిపెద్ద కార్పొరేషన్‌గా జీహెచ్‌ఎంసీ
హైదరాబాద్,ఆగస్టు28 : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న సాంప్రదాయక విద్యుత్ వీధి దీపాల
స్థానంలో ఆధునిక ఎల్.ఇ.డి బల్బులను అమర్చే పక్రియ అత్యంత వేగవంతంగా కొనసాగుతోంది. జూలై మాసంలో ప్రారంభించిన ఈ ఎల్.ఇ.డి లైట్ల ఏర్పాటు కేవలం నెలన్నర వ్యవధిలోనే రికార్డు స్థాయిలో లక్ష లైట్లను అమర్చారు. ఈ సంవత్సరాంతంలోగా హైదరాబాద్ నగరంలో ఉన్న సాంప్రదాయక వీధి దీపాల స్థానంలో ఎల్.ఇ.డి లైట్లను ఏర్పాటు చేయాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కె.టి.రామారావు జీహెచ్‌ఎంసీకీ లక్ష్యాన్ని నిర్ధేశిరచారు. ఈ లక్ష్యానికి అనుగుణంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్న 4.53 లక్షల సాంప్రదాయక వీధి దీపాల స్థానంలో ఎల్.ఇ.డి లైట్లను అమర్చే అతిపెద్ద పక్రియ శరవేగంగా కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎనర్జీ ఎఫిసియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఎల్.ఇ.డి బల్బుల మార్పిడి కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు లక్షకు పైగా ఎల్.ఇ.డి లైట్లను అమర్చారు. ప్రస్తుతం అమర్చిన ఈ లక్షకు పైగా ఎల్.ఇ.డి బల్బుల వల్ల రోజుకు 2.32 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా అవుతుంది. యూనిట్‌కు 7 రూపాయల చొప్పున మొత్తం 1.65 కోట్ల రూపాయల విద్యుత్ ఆదా అవుతోంది. అంటే మొత్తం 4.55 లక్షల విద్యుత్ దీపాల స్థానంలో ఎల్.ఇ.డి బల్బులను అమర్చడం ద్వారా సంవత్సరానికి 20.73 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా అవుతుంది. తద్వారా జీహెచ్‌ఎంసీకి రూ. 14.72కోట్లు విద్యుత్ బిల్లు ఆదా కానుంది. దీంతో పాటు సంవత్సరానికి 16 వేల 587 టనన్నుల కార్బన్ డయాక్సైడ్ విడుదల తగ్గనుంది. కాగా ఇప్పటివరకు అమర్చిన 1.02 లక్షల ఎల్.ఇ.డి విద్యుత్ దీపాల్లో 18, 35, 70, 110, 190 వాట్ల కెపాసిటీ కలిగిన విద్యుత్ దీపాలు ఉన్నాయి. కాగా నగరంలోని పలు ప్రధాన మార్గాల్లో ఏర్పాటు చేసిన ఎల్.ఇ.డి లైట్లతో ఆయా వీధులు అదనపు కాంతితో ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. ఎల్.ఇ.డి లైట్ల వల్ల రాత్రివేళలో ప్రమాదాలు కూడా తగ్గాయని పలువురు పేర్కొన్నారు.ఇక దేశంలోని మొత్తం ప్రధాన నగరాల్లోని సాంప్రదాయక వీధి దీపాల స్థానంలో ఎల్.ఇ.డి లైట్లను అమర్చే పక్రియను చేపట్టిన అతిపెద్ద కార్పొరేషన్ జీహెచ్‌ఎంసీ రికార్డు సృష్టించనుంది. ఇప్పటి వరకు కేవలం దక్షణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అత్యధికంగా రెండు లక్షల విద్యుత్ దీపాల స్థానంలో ఎల్.ఇ.డి లైట్లను అమర్చింది. దీంతో పాటు విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ లక్ష ఎల్.ఇ.డి లైట్లను ఏర్పాటు చేసింది. అయితే ఈ రెండు కార్పొరేషన్లు ఎల్.ఇ.డి బల్బులను అమర్చడానికి సంవత్సరకాలం తీసుకున్నాయి. గ్రేటర్ హైదరాబాద్‌లో జూన్ మాసంలో ప్రారంభమైన ఎల్.ఇ.డి లైట్ల మార్పడి పక్రియను టెండర్ల పూర్తి, మ్యాన్‌పవర్, ట్రాఫిక్ క్లియరెన్స్, వాహనాలు, ల్యాడర్లు, వర్కర్ల సేకరణ పూర్తి చేసి జూన్ చివరి మాసంలో ప్రారంభించింది. కేవలం నెలన్నర వ్యవధిలోనే నగరంలో ఇప్పటి వరకు లక్షా రెండు వేల ఎల్.ఇ.డి లైట్లను ఏర్పాటు చేసింది.