లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్

అడిలైడ్: బంగ్లాదేశ్ నిర్దేశించిన 276 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు ఇంగ్లండ్ బ్యాటింగ్ ప్రారంభించింది. మొయిన్ అలీ, బెల్ ఓపెనర్లుగా వచ్చారు. బంగ్లాదేశ్ బౌలర్ మోర్తజా తొలి బంతి వేశాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 275 పరుగులు చేసింది.