లక్ష ఉద్యోగాలిస్తాం

C

– కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తాం

– నీళ్లు,నిధులు,నియామాకాలకు కట్టుబడి ఉన్నాం

– సభలో సీఎం కెేసీఆర్‌ సుదీర్ఘ ప్రసంగం

హైదరాబాద్‌,మార్చి29(జనంసాక్షి): రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఇచ్చిన హావిూమేరకు లక్ష ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని సిఎం కెసిఆర్‌ అసెంబ్లీ వేదికగా మరోమారు పునరుద్ఘాటించారు. ఇప్పటికే దాదాపు 35 వేల వరకు ఉద్యోగ నియామకాలకు సంబంధించి కసరత్తు జరుగుతోందన్నారు. ఇంటికో ఉద్యోగం అని తాను ఎప్పుడూ చెప్పలేదని, అది సాధ్యం కూడా కాదని స్పస్టం చేశారు. ఇలాంటి ఆలోచనలో ఎవరైనా ఉంటే దానినుంచి బయట పడాలన్నారు. అయితే ఇచ్చిన హావిూ మేరకు లక్ష ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగ  అభ్యర్థుల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌ సానుకూలంగా స్పందించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చెప్పిన విధంగానే లక్ష ఉద్యోగాలను భర్తీ చేసి తీరుతామని మరోసారి పునరుద్ఘాటించారు. నిరుద్యోగులు ఎవరూ ఆందోళన చెందొద్దని విజ్ఞప్తి చేశారు. దశల వారీగా పోస్టుల భర్తీ చేపడుతామని తెలిపారు. ఇప్పటికే 24,500 పోస్టులకు నోటిఫికేషన్‌ ఇచ్చామని గుర్తు చేశారు. మరో 10 వేల పోస్టులతో మే నెలలో డీఎస్సీ వేస్తామన్నారు. దీనిపై విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి దృష్టి సారించారని తెలిపారు. వాయిదాపడ్డ గ్రూప్‌-2 పోస్టులను పెంచి 1000 పోస్టులతో త్వరలో గ్రూప్‌ -2 నోటిఫికేషన్‌ వస్తుందని చెప్పారు. ఇప్పుడున్న 439 పోస్టులకు తోడు 500 నుంచి 600 పోస్టుల పెంపుతో నాలుగైదు రోజుల్లో గ్రూప్‌-2 నోటిఫికేషన్‌ వెలువడుతుందని పేర్కొన్నారు. అవకాశం ఉన్నంత వరకు ఉద్యోగాల భర్తీ జరుగుతుందని తెలిపారు. మిషన్‌ కాకతీయ, భగీరథలో అవకాశం ఉన్న మేర భర్తీ చేస్తూనే ఉన్నామని అన్నారు. కమల్‌నాథన్‌ కమిటీ ఉద్యోగుల విభజనకు ఆరు నెలల గడువు కోరిందన్నారు. ఉద్యోగుల విభజన పూర్తి అయితే మరిన్ని పోస్టులు వస్తాయన్నారు. ఉద్యోగుల విభజన కాకుండా అడ్డదిడ్డంగా పోస్టుల భర్తీ చేపడితే సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందన్నారు. కమల్‌నాథన్‌ కమిటీని పరిగణనలోకి తీసుకోకుండా ఉద్యోగ నియామకాలు చేపట్టినట్లు అయితే, అనుకోకుండా ఆంధ్రా ఉద్యోగులు ఇక్కడే ఉంటామని మొండికెస్తే సూపర్‌ న్యూమరరీ పోస్టులు సృష్టించే అవసరం ఏర్పడుతుందన్నారు. సూపర్‌ న్యూమరరీ పోస్టుల వల్ల తెలంగాణ రాష్ట్రంపై అదనపు ఆర్థిక భారం పడే అవకాశం ఉందని వివరించారు.

నిరుద్యోగులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. లక్ష ఉద్యోగాలు భర్తీ చేసి తీరుతామని ఉద్ఘాటించారు. ఉద్యోగుల విభజన పూర్తి అయితే మరిన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. చైనా పర్యటనకు వెళ్లి ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి  చేసిన ఆరోపణలకు సీఎం  ఘాటుగా సమాధానం చెప్పారు. తనతోపాటు చైనా పర్యటనకు వెళ్లిన బృందం మొత్తం విమానం టికెట్‌ ఖర్చులు, ¬టళ్లలో బసచేసిన ఖర్చులు మొత్తం రూ.2.75 కోట్లు అని వివరించారు.  తాము ఏదో విహార యాత్రకు పోయినట్టు ప్రతిపక్షాలు గోల చేయడం తగదన్నారు. తమ పర్యటనలో విదేశీ వ్యాపారవేత్తలతో మాట్లాడి తెలంగాణకు కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చామని పేర్కొన్నారు. అప్పుల విషయంలో ప్రమాదంలో పడిపోతున్నామని ప్రతిపక్ష సభ్యుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చేస్తోన్న విమర్శ సరికాదన్నారు. తాము కేంద్ర నిబంధనలకు లోబడే వ్యవహరిస్తున్నామని స్పష్టం చేశారు. అన్ని ప్రభుత్వాలు ఇలాగే చేస్తాయని అన్నారు.

అభివృద్ది కోసమే అప్పులు చేస్తున్నాం

అప్పులనేవి అభివృద్ది కోసమే అని సిఎం కెసిఆర్‌ పునరుద్ఘాటించారు. ఇందులో తప్పుపట్టాల్సింది కానీ, చింత పడాల్సింది కానీ లేదన్నారు. అప్పులు ఇస్తే తీరుస్తారనే నమ్మకం ఉంటేనే ఇస్తారని అన్నారు. అసెంబ్లీలో సిఎం మాట్లాడుతూ అప్పులను వివిధ పథకాల కోసం తసీఉకుని వస్తున్నామని అన్నారు. దేశంలో ఎక్కడా బడ్జెట్‌లో అనుకున్న మేర ఖర్చులు జరగవని కేసీఆర్‌ స్పష్టం చేశారు. ఆర్థికవేత్తలతో కలిసి జిల్లాల వారీగా రూపొందించిన అంచనాల ప్రణాళికల మేరకే బడ్జెట్‌ కేటాయింపులు చేసినట్లు తెలిపారు. కాంగ్రెస్‌ పాలనలో బడ్జెట్‌ అంచనాల్లో 79.52 శాతానికి చేరువైనట్లు తెలిపారు. బడ్జెట్‌లో అనుకున్నంత ఖర్చు చేశారా? లేదా? అనే విూమాంస ఉంటుందని… పరిస్థితులు, సందర్భాలకు అనుగుణంగా అంచనాలు మారుతుంటాయని పేర్కొన్నారు. 2019-20 నాటికి తెలంగాణ బడ్జెట్‌ రూ.2లక్షల కోట్లకు చేరుతుందన్నారు. ఇప్పుడు తెలంగాణ నిధులు తెలంగాణకే ఖర్చు చేస్తున్నామని అన్నారు. గతం/-లో ఇక్కడి భూములు అమ్మి ఆంధ్రాలో ఖర్చు పెట్టేవారన్నారు. 2015-16లో తెలంగాణ అభివృద్ధి రేటు 11.7శాతంగా ఉన్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. అభివృద్ధి రేటు ఆధారంగానే రాష్టాల్రకు అప్పులు పుడతాయన్నారు. వృద్ధి రేటు తక్కువ ఉన్న రాష్టాల్రకుఅప్పులు పుట్టే పరిస్థితి లేదన్నారు. చైనాలో 9రోజులు పర్యటించి 13 వ్యాపార సమావేశాల్లో పాల్గొని పలు ఒప్పందాలు చేసుకున్నట్లు తెలిపారు. ఆ పర్యటన నిమిత్తం విమాన ఖర్చులు రూ.2.03 కోట్లు, ఇతర ఖర్చులు రూ.72లక్షలు అయినట్లు తెలిపారు.అంబేడ్కర్‌ 125వ జయంతిని ఈ సారి ఘనంగా నిర్వహిస్తామని  కేసీఆర్‌ వెల్లడించారు. ట్యాంక్‌బండ్‌ వద్ద అంబేడ్కర్‌ భవనం కూలే పరిస్థితిలో ఉందని.. పాత భవనం స్థానంలో బహుళ అంతస్తుల నిర్మాణానికి సిద్ధంగా ఉన్నామని  తెలిపారు. ఈసారి రూ.15 వేల కోట్లతో 2 లక్షల రెండు పడక గదుల ఇళ్లు నిర్మిస్తామని తెలిపారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా మిషన్‌ భగీరథ కచ్చితంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పనితీరును ప్రధాని మోడీ మెచ్చుకున్నారని సీఎం కేసీఆర్‌ తెలిపారు. తెలంగాణ రాష్టాన్రికి ఈ 22 నెలల్లో అనేక అవార్డులు వచ్చాయని చెప్పారు. మిషన్‌ భగీరథ ద్వారా ఇంటింటికీ నీరందిస్తామన్నారు. ఈ ఏడాది రెండు లక్షల డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను కచ్చితంగా కట్టించి ఇస్తామని పునరుద్ఘాటించారు. తెలంగాణకు సాగు, తాగు నీరు, విద్యుత్‌ రంగాలే కీలకమన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆదాయం పెరుగుతుందన్నారు.  ప్రభుత్వ ఆస్పత్రులను మెరుగుపరుస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్పత్రికి పోతే కొత్త రోగాలు వస్తాయని రోగులు భయపడేవాళ్లు, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వాసుపత్రుల్లో మొత్తం 17,639 బెడ్లు ఉన్నాయని తెలిపారు. కొత్త బెడ్ల కోసం ఈ బడ్జెట్‌లో రూ. 171 కోట్లు కేటాయించామన్నారు. డయాలసిస్‌, ఎమ్మారైతో పాటు పలు టెస్టుల కోసం ప్రతి జిల్లాలో నాలుగు సెంటర్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. బీపీఎల్‌ కార్డులున్న వారందరికీ కళ్యాణలక్ష్మి పథకం వర్తిస్తుందన్నారు. 2013-14లో ఇసుక ద్వారా ఆదాయం రూ. 5 లక్షలు వస్తే, 2014-15లో రూ. 13 కోట్లు, 2015-16లో రూ. 340 కోట్లు వచ్చాయని తెలిపారు. కచ్చితంగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తామన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని పేర్కొన్నారు. ఏప్రిల్‌లో జరిగే పార్లమెంట్‌ సమావేశాల్లోనే నియోజకవర్గాల పెంపు బిల్లు పెడుతామని కేంద్ర ¬ంమంత్రి చెప్పారని గుర్తు చేశారు.

కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తాం

తెలంగాణ రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీరు పారిస్తామన్న హావిూకి కట్టుబడి ఉన్నామని, దీంతోనే ఆకుపచ్చ తెలంగాణ సాధ్యమని  సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. నీళ్లు,నిధులు, నియామకాలకు కట్టుబడి ఉన్నామని అన్నారు.  అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ జరిగిన తర్వాత సభ్యులకు ధన్యావాదాలు తెలుపుతూ సీఎం ప్రసంగించారు. తెలంగాణ రాష్టాన్న్రి సస్యశ్యామలం చేస్తామమి వెల్లడించారు. రాబోయే 5 సంవత్సరాల్లో రూ.లక్షా 50 వేల కోట్లు ఖర్చుచేస్తే ప్రాజెక్టులన్నీ పూర్తవుతాయని పేర్కొన్నారు. మిషన్‌ భగీరథ ఎక్సెలెంట్‌ పథకమి సీఎం అభివర్ణించారు. మిషన్‌ భగీరథతో రాష్ట్రంలోని ప్రతీ నగరం, పట్టణం, గ్రామం మంచినీటిని అందిస్తామన్నారు. మిషన్‌ భగీరథ కోసం ఎంతైనా చేస్తామని వెల్లడించారు. దీంతో ప్రజలకు సేఫ్‌ డ్రింకింగ్‌ వాటర్‌ ఇవ్వాలన్నదే తమ లక్ష్యమన్నారు. ఇది ప్రభుత్వ బాధ్యతని అన్నారు. దీనికి ఖర్చు పెట్టే నిధులను వేస్ట్‌ కింద కాకుండా ప్రజల పక్షాన చూడాలన్నారు. ప్రాజెక్టులపై సమగ్రచర్చి చేస్తామని, తాను పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇస్తానని, తరవాత సభ్యులు వారి అభిప్రాయాలు చెప్పవచ్చన్నారు. దీనిపై ఎలాంటి సూచనలైనా స్వీకరిస్తామని అన్నారు. చివరగా నీళ్లు రావాలన్నదే తమ లక్ష్యమన్నారు. అందుకే ఇతర రాష్టాల్రతో ఒప్పందాలు చేసుకున్నామని, పంచాయితీలు పెట్టుకోదల్చుకోలేదన్నారు.  ఇకపోతే ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారా? అనుకూలంగా ఉన్నారా? అనేదానికి గీటురాయి ఎన్నికలు అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని వ్యాఖ్యానించిన ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి వ్యాఖ్యలను విబేధిస్తున్నానని స్పష్టం చేశారు. ప్రజలు వ్యతిరేకంగా లేరు అనడానికి ఇటీవలే జరిగిన ఎన్నికలే నిదర్శనమని చెప్పారు. ప్రజలు వ్యతిరేకంగా ఉంటే ఏ ఎన్నికల్లో కూడా టీఆర్‌ఎస్‌ గెలిచేది కాదన్నారు. ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత ఉంది అనడం అసంబద్ధమని ఉద్ఘాటించారు. వరంగల్‌ ఉప ఎన్నిక నుంచి మొదలుకొని మొన్న జరిగిన ఖమ్మం, వరంగల్‌ కార్పొరేషన్‌, అచ్చంపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ విజయం సాధించిన అంశాన్ని గుర్తు పెట్టుకోవాలని సూచించారు. అసెంబ్లీలో  ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ జరిగింది. ఈటల రాజేందర్‌ ప్రవేశపెట్టిన ఈ బిల్లుపై సభలో పలువురు సభ్యులు చర్చించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చలో పాల్గొన్న సభ్యులకు ధన్యావాదాలు తెలిపారు. సభలో ఏ ఒక్క అంశం విూద కూడా గొప్పగా చర్చ జరగలేదన్నారు. బడ్జెట్‌పై చర్చతోపాటు 40 పద్దుల విూద అసెంబ్లీలో చర్చ జరిగిందన్నారు. అనుభవంలేని రాష్ట్రం అయినప్పటికీ ఆర్థిక నిపుణుల సాయంతో బడ్జెట్‌ను రూపొందించామని తెలిపారు.  బిల్లుపై ప్రతిపక్ష కాంగ్రెస్‌ సభ్యుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను సిఎం తిప్పికొట్టారు. అప్పులుచేస్తున్నామన్న ఆరోపణలు సరికాదన్నారు. అభివృద్ది జరగాలంటే అప్పులు తప్పవన్నారు. దీనిపైచింత చేయాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌-2016-17 మానవీయ బడ్జెట్‌ అని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే గొంగిడి సునీత కొనియాడారు. ఎన్నడూ లేనివిధంగా సభలో పద్దులపై చర్చ జరిగిందని తెలిపారు. ప్రభుత్వం బడ్జెట్‌లో సంక్షేమానికి పెద్దపీఠ వేసిందని పేర్కొన్నారు. గతంలో దేవాలయాలకు ఒక్కపైసా కేటాయించిన సందర్భాలు లేవని గుర్తు చేశారు. కానీ సీఎం కేసీఆర్‌ యాదాద్రితోపాటు వేములవాడ పుణ్యక్షేత్రాలను అభివృద్ధి చేసేందుకు

నిదులను విడుదల చేశారని గుర్తుచేశారు. త్వరలో భద్రాద్రి రామన్న ఆలయానికి కూడా నిధులు కేటాయిస్తామని సీఎం అన్నట్టు ఆమె వెల్లడించారు.

విశ్వవిద్యాలయాలను ఆధునిక దేవాలయాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం

రాష్ట్రంలో ఉన్న విశ్వవిద్యాలయాలు నేడు దారితప్పి అక్రమాలకు కేంద్రాలుగా మారుతుండడంతోపాటు, పాలకమండలికి గవర్నర్‌ ఒక్కరే పలు విశ్వవిద్యాలయాలకు అధిపతిగా ఉండడం వల్ల జరుగుతున్న జాప్యాన్ని నివారించేందుకు మాత్రమే యూనివర్శిటీల చట్టాలను మార్చాలని ప్రభుత్వం భావిస్తుందని, దీనికి ప్రతిపక్షాలు అన్ని పెద్దమనస్సుతో ఆమోదం తెలపాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు పేర్కొన్నారు. మంగళవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలను రద్దు చేసుకుని పలు బిల్లుల సవరణలపై చర్చించే అంశంపై తొలుత ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి డాక్టర్‌ బీఆర్‌ అంబెద్కర్‌ ఓపెన్‌ యూనివర్శిటీ 1982, రాజీవ్‌గాంధీ టెక్నికల్‌ యూనివర్శిటీ 2008 చట్టలకు సవరణలను ప్రతిపాదించారు. ఇందులో ఇప్పటికి ఉన్న విశ్వవిద్యాలయాల నిబంధనలను మార్చుకునే అవకాశం ఎపి రీఆర్గనైజేషన్‌ కమిటీ అవకాశం కల్పించిందన్నారు. గతంలో సమైక్య రాష్ట్రంలో ఉన్న నిబంధనలను మార్చుకుని తెలంగాణాకు ప్రత్యేకమైన వాటిని ప్రతిపాదిస్తున్నామన్నారు. ఇందులో విశ్వవిద్యాలయంలో వైస్‌ చాన్సలర్‌, చాన్సలర్‌ల నియామకం, సెర్చ్‌ కమిటీల నియామకాన్ని ప్రభుత్వం స్వాధీనపరుచుకుంటుందన్నారు. వైస్‌ చాన్సలర్‌ల నియామకం అధికారం చాన్సలర్‌లకుండేదని దానిని నేడు సవరణలతో ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. అయితే ఇందులో రాజకీయ జోక్యం కాని, పార్టీ నాయకులను నియమించుకో వడం అనేది ఎట్టి పరిస్థితిలోను ఉండదన్నారు. పూర్తి పారదర్శకంగా నియామకం ఉంటుందన్నారు. అలాగే రాజీవ్‌గాంధీ సాంకేతిక విశ్వవిద్యాలయంలో కూడా విసి, చాన్స్‌లర్‌,  పాలకమండలి నియామకం ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. దీనివల్ల పరిపాలన నిష్పక్షపాతంగా జరుగడమేకాక జవాబుదారితనం పెరుగుతుందన్నారు.  రెండు బిల్లులను ఆమోదించాలని కడియం సభముందుంచారు. దీనిపై చర్చను ప్రారంభించిన స్పీకర్‌ తొలుత ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్‌కు అవకాశం కల్పించగా సీఎల్పీఉపనేతగా ఉన్న జీవన్‌రెడ్డి మాట్లాడుతూ వైస్‌ చాన్సలర్‌ల నియామకం పేరుతో చాన్సలర్‌గా ఉన్న గవర్నర్‌ను తొలగించే ఉద్దేశ్యం కూడా ఇందులో ఉందన్నారు. ఇప్పటివరకు గవర్నర్‌ చేత విసి నియామకం జరిగితే నిష్పక్షపాతంగా ఉంటుందనే నమ్మకం ఇటు విద్యార్థులకు, అటు అధ్యాపకులకు, మేధావులకు ఉండేదని నేడు ప్రభుత్వం చేస్తున్న సవరణల వల్ల ఆ అవకాశం కోల్పోతుందన్నారు. ఈ ఆవేదన విద్యార్థి లోకాన్ని కుదిపేస్తుందన్నారు.  ప్రస్తుతం గవర్నర్‌ నియామకం అధికారం ఉన్నప్పటికి కూడా ప్రభుత్వం సూచించిన ముగ్గురు వ్యక్తుల్లో ఒకరిని అదికూడా ప్రభుత్వం చెప్పిన వారినే గవర్నర్‌ నియమిస్తారన్నారు. ఇందులో ప్రభుత్వానికి ఎందుకు భయం కలుగుతుందని ప్రశ్నించారు. ప్రభుత్వం ఏర్పడి 22 నెలలు దాటినా కూడా విద్యావిధానంపై స్పష్టతకు రాలేక ప్రభుత్వం సతమతమవుతుందన్నారు. ఆంగ్ల మాధ్యమంలో ఉచితంగా నిర్బందవిద్యను అమలు చేస్తామన్నా నేటికి దిక్కేలేదన్నారు. విద్యాహక్కు చట్టంనిర్వీర్యం అవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు. అంతేకాక కోర్టులు జోక్యం చేసుకుని విశ్వవిద్యాలయాల్లో ప్రభుత్వాన్ని తప్పుపడుతున్న సందర్బాలు కూడా నేడు చోటు

చేసుకుంటున్నాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 50శాతంకు పైగా విద్యాబోదన సిబ్బంది బోదనేతర సిబ్బందిఖాళీలు వెక్కిరిస్తున్నాకూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ప్రస్తుత చట్టంతొ కూడా ప్రభుత్వం ఇష్టమున్న వ్యక్తిని నియమించుకునే అవకాశం ఉంటుందన్నారు.చాన్సలర్‌గా గవర్నర్‌ ను తొలగించడం వల్ల యూజీసి, కేంద్రప్రభుత్వ గ్రాంట్స్‌ రాకుండా పోతాయన్నారు. యూనివర్శిటీల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీస్తున్నందుకే తమకు బాదగా ఉందన్నారు. అందుకే ఈ బిల్లులను వ్యతిరేకిస్తున్నామన్నారు. దీనిపై కాంగ్రెస్‌ పార్టీ వాకౌట్‌ చేస్తుందన్నారు. విద్యార్థులు, అద్యాపకులు మేదావుల ఆలోచనలకు అనుగుణంగా కాంగ్రెస్‌ పార్టీ వ్యవహరిస్తుందని, వారి అభిప్రాయం మేరకు తాము వాకౌట్‌ చేస్తున్నా మన్నారు. రాజీవ్‌గాంధీ సాంకేతిక విశ్వవిద్యాలయంచట్ట సవరణపై కూడా కాంగ్రెస్‌ నేత చిన్నారెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్‌ యూనివర్శిటీలో ఇప్పటివరకు 34 సంవత్సరాలుగా గవర్నర్‌ ఉండడం వల్ల జరిగిన నష్టం ఏంటో సభకు వివరిచాలన్నారు అంతేకాక రాజీవ్‌గాంధీ సాంకేతిక విశ్వవిద్యాలయంలో కూడా ఎందుకు మార్పులు తేవడం వల్ల కొత్తగా ఆశించేది ఏంటని ఆయన సూటిగా ప్రశ్నించారు. ప్రభుత్వ చర్యల వల్ల దేవాలయంలో దేవుడిని తొలగించి మా వ్యక్తులను నియమిస్తామనే దురుద్దేశ్యం కనిపిస్తుందన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ఎంతో మంది మేధావులు కూడా మంచి నిష్ణాతులు విసిలుగా పనిచేసి ప్రపంచానికి మార్గదర్శకంగా నిలిచారన్నారు. చర్చలో బీజెపినుంచి లక్ష్మణ్‌ మాట్లాడుతూ ప్రభుత్వ ఆలోచన సరైంది కాదన్నారు. విసిల నియామకం ప్రభుత్వం సెర్చ్‌ కమిటీలపేరుతో సూచిస్తున్నందున ఆ విధానాన్ని పాటించాలన్నారు. బిల్లువల్ల రాజకీయ జోక్యం పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిని వ్యతిరేకిస్తున్నామన్నారు. గవర్నర్‌ వ్యవస్థ పై నమ్మకం పోతుందన్నారు. అవసరమైతే పాలకమండలిని ప్రభుత్వం నియమించుకోవాలన్నారు.  బిల్లును వ్యతిరేకిస్తున్నామన్నారు. టీడీపినేత సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ విద్యావ్యవస్థ అనేది రాజకీయాలకతీతంగా కొనసాగాలన్నారు. ఉన్నత ప్రమాణాలున్న విద్యావ్యవస్థ ప్రక్కదారి పడుతుందన్నారు. ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా విశ్వవిద్యాలయాలను పటిష్టం చేసిన సందర్బాలున్నాయన్నారు. వైసిపి నేత వెంకటేశ్వర్లు మాట్లాడుతూ విసిల నియామకం గవర్నర్‌ల చేతుల్లోనే ఉండాలన్నారు. సిపిఐ నేత  రవింద్రకుమార్‌ మాట్లాడుతూ 1982నుంచి నేటి వరకు కొనసాగుతున్న వ్యవస్థను మార్చాలనుకోవడం దారుణమన్నారు. గతంలో కూడా ప్రభుత్వం చేతులలో ఉంటేనే దానిని గవర్నర్‌కు కట్టబెట్టారని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఇప్పటికి నాక్‌ గుర్తింపు లేకుండా ఇబ్బంది పడుతున్నాయన్నారు. గవర్నర్‌ బాద్యతలను ప్రభుత్వం తీసుకోవడం దారుణమన్నారు. బిల్లులను వ్యతిరేకిస్తున్నామన్నారు. రసమయి బాలకిషన్‌ మాట్లాడుతూ దేశంలోనే మంచి విద్యావ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చిత్త శుద్దితో కృషి చేస్తుందన్నారు. దీనికోసమే మార్పులు తీసుకువస్తున్నామన్నారు. ప్రధానమంత్రి స్వంతరాష్ట్రం గుజరాత్‌లో కూడా మార్పు చేశారన్నారు. చర్చలో మంత్రి సమాదానం ఇస్తూ ప్రభుత్వం రాజకీయ జోక్యం చేసుకోదన్నారు. పూర్తి పారదర్శక చర్యలు పాటిస్తామన్నారు. ఉద్యమసమయంలో సీఎం కేసీఆర్‌ విశ్వ విద్యాలయంలు సందర్శించినప్పుడు అనేక కష్టనష్టాలను గుర్తించారన్నారు. అందుకే వ్యవస్థను మార్చాలని ప్రతిపాదిస్తున్నామన్నారు. చర్చలో ముఖ్యమంత్రి పాల్గొంటూ విసిల నియామకంను ప్రభుత్వం తీసుకున్నంత మాత్రాన ఎలాంటి అనర్థాలు లేవన్నారు. ప్రస్తుతం విసి లు దిగిపోయేటప్పుడు ఉదయం మూడు వందలు, 170మందిని అక్రమంగా నియమించుకుని కరప్షన్‌కు పాల్పడ్డారన్నారు. ఎంతో చారిత్ర కమైన ఉస్మానియా విశ్వవిద్యాలయం అటానమస్‌గా ఉన్నంత మాత్రాన ఎన్ని అక్రమాలు జరుగుతున్నాయి. ఎన్ని ఎకరాల విలువైన స్థలాలు అన్యాక్రాంతమైనాయనేది కళ్ల ముందు కనిపిస్తుందన్నారు. విసిలు అక్రమాలకు పాల్పడుతున్న సంఘటనలు తెలంగానాలోనే చూశామన్నారు. ప్రభుత్వం ఎంతో మంచి ఉద్దేశ్యంతో ప్రతిపక్షనేతను కమిటీలో తీసుకుంటామనే ప్రతిపాదనకూడా తీసుకుంటున్నామన్నారు. గవర్నర్‌ అనుమతితోనే ఈమార్పులు ప్రవేశపెడుతున్నామన్నారు. బిల్లు తెచ్చినంత మాత్రాన గవర్నర్‌ చాన్సలర్‌గా ఉండడనేది లేదన్నారు. రెండు మూడు, గవర్నర్‌ కోరిక మేరకు చాన్సలర్‌గా ఉంటాడని, హైకోర్టు జడ్జీలు, న్యామూర్తులు,విద్యావేత్తలు కూడా చాన్సలర్లుగా ఉంటారన్నారు. ఇందులో దురుద్దేశ్యంలేదన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉన్న నల్సార్‌ యూనివర్శిటీకి తెలంగాణా ప్రభుత్వం నిధులు ఇస్తుందని, ఇందులో కూడా తమ ప్రాతినిథ్యం కోసం ప్రయత్నిస్తున్నా మన్నారు. ఉత్తమమైన న్యాయమూర్తులను కూడా ఇవ్వాలని హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ను కలిసి కోరానన్నారు. ఇందులో రాజకీయం ఏమి ఉండదన్నారు. అసెంబ్లీలో విద్యావ్యవస్థపై ఇంత మంచి చర్చ జరుగడం ఆహ్వానిస్తున్నా మన్నారు. గవర్నర్‌ ¬దాకు తగ్గట్టుగా ఉన్న వ్యక్తినే చాన్సలర్‌లుగా నియమిస్తామన్నారు. యూనివర్శిటీల్లో విచ్చలవిడితనం, చెడ్డ పరిస్థితేలు పెరిగి పోయాయన్నారు.అయినా కూడా ప్రతిపక్షం నిరసన తెలుపుతానంటే వారి విజ్ఞతకే వదిలేస్తామన్నారు. ఈ క్రమంలో జీవన్‌రెడ్డి మాట్లాడుతూ అక్రమాలు జరిగినట్లు తేలిన తర్వాత చర్యలు తీసుకునే అదికారం ప్రభుత్వానికి ఉంటుందన్నారు. దీనికి ఎందుకు భయపడుతున్నారన్నారు. ప్రభుత్వ జోక్యం పూర్తి పెరిగిపోయే ప్రమాదంతోపాటు యూజిసి, కేంద్రం నిధులు రాకుండా పోతాయనేది వాస్తవమని అందుకే తాము వ్యతిరేకిస్తున్నామని, వాకౌట్‌ చేస్తున్నామన్నారు. అనంతరం ఉపముఖ్యమంత్రి బిల్లులను సభలో ప్రవేశ పెట్టగా ఏకగ్రీవంగా ఆమోదించింది.

విసిల ఇష్టారాజ్యాన్ని అడ్డుకునేందుకే సవరణ

నియంత్రణ లేకనే విశ్వవిద్యాలయ  వీసీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, అందుకే యూనివర్సిటీలలో విచ్చలవిడితనం వచ్చిందని తెలంగాణ సీఎం కేసీఆర్‌ మండిపడ్డారు. విశ్వవిద్యాలయాలకు ఉన్నత విద్యావంతులను, న్యాయమూర్తులను విసిలుగా నియమిస్తామని అన్నారు. యూనివర్సిటీలకు పూర్వ వైభవం తెచ్చేందుకే నియామకాల కోసం వేసే కమిటీలో ప్రతిపక్ష సభ్యుడు కచ్చితంగా ఉండేలా చూస్తామని తమ ప్రభుత్వ నిర్ణయాన్ని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. గవర్నర్‌ వేరు, ప్రభుత్వం వేరుకాదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. విశ్వవిద్యాలయాల్లో గత అనుభవాలు బాధాకరంగా ఉన్నాయని చెప్పారు. అంబేద్కర్‌ ఓపెన్‌ వర్సిటీ చట్ట సవరణ బిల్లు తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మంగళవారం శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలు లేవనెత్తిన ప్రశ్నలకు సీఎం కేసీఆర్‌ సమాధానం ఇచ్చారు. గతంలో వీసీలు సాయంత్రం పదవి నుంచి దిగిపోతుండగా 300, 370 మందిని నియమించిన సందర్భాలు ఉన్నాయని చెప్పారు. సమైక్య రాష్ట్రంలో అటానవిూ పేరిట ఉస్మానియా యూనివర్సిటీకి  ఇచ్చిన భూమి ఎంత, ఇప్పుడు ఉన్న భూమెంత అని సభలో మంగళవారం ఆయన ప్రశ్నించారు. ఓయూ విషయంపై మరిన్ని అంశాలను ప్రస్తావించారు. ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి కూడా ఒకప్పటి ఓయూ విద్యార్ధి అని కేసీఆర్‌ అన్నారు.ప్రభుత్వ నియంత్రణ లేదు కాబట్టి యూనివర్సిటీలకు స్వయం ప్రతిపత్తి ఇచ్చిందని పేర్కొన్నారు. అందుకే వర్సిటీకి కేటాయించిన భూమిలో వందల ఎకరాలు అన్యాక్రాంతం అయ్యాయని విచారణ వ్యక్తంచేశారు. యూనివర్సిటీలకు ఇచ్చిన స్వయం ప్రతిపత్తి దుర్వినియోగం అయిందని గుర్తించాలన్నారు. విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు కాకతీయ, తెలంగాణ, ఉస్మానియా విశ్వవిద్యాలయాల వీసీల తీరు బాధాకరంగా ఉందని సాయంత్రం దిగిపోయే ముందు భారీ ఎత్తున నియామకాలు జరిగాయని అన్నారు. ఫలితంగా రిటైర్డ్‌ ఉద్యోగులకు పెన్షన్లు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. వీసీల నియామకం ఆషామాషీగా తీసుకునే నిర్ణయం కాదని అన్నారు. ఈ నియామకాల్లో తమకు దురుద్దేశం ఏవిూ లేదని వివరణ ఇచ్చారు. గవర్నర్‌ వేరు.. రాష్ట్ర ప్రభుత్వం వేరు కాదు. ఇందులో ఏ దురుద్దేశం లేదు. గతంలో వీసీలు ప్రవర్తించిన తీరుపై విచారణ చేయాల్సి వచ్చింది. యూనివర్సిటీలను పటిష్ట పరచడానికి న్యాయమూర్తులను వీసీలుగా నియమించాలని సంకల్పించాం. హైకోర్టు సీజేను కలిసి వీసీల నియామానికి కొందరు జడ్జిలను ఇవ్వాలని ఇప్పటికే కోరినట్లు సీఎం పేర్కొన్నారు.