లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అన్నదానం
జనం సాక్షి ఆర్మూర్ రూరల్ జూలై:-30
ఆర్మూర్ పట్టణంలోని జంబి హనుమాన్ ఆలయంలో లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ గ్రీన్ ఆధ్వర్యంలో శనివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు చేపూర్ గణేష్ మాట్లాడుతూ లయన్స్ 320-డి పాస్ట్ డిస్ట్రిక్ట్
గవర్నర్ ఘట్టమనేని బాబురావు జన్మదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ వ్యాప్తంగా సుమారు మూడు వందలక్లబ్బులలో హంగర్ రిలీఫ్ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం చేపట్టడం
జరుగుతుందన్నారు.
ఆకలితో అలమటిస్తున్న నిరుపేద ప్రజలకు ఒక పూట ఆన్న ప్రసాదాన్ని దానం చేయాలన్న సంకల్పంతో బాబురావ్ ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని అన్ని క్లబ్బుల ద్వారా జరిపిస్తారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కార్యదర్శి భూసం
ప్రతాప్, కోశాధికారి పోల్కం వేణు, చార్టర్ అధ్యక్షులు లయన్ నివేదన్ గుజరాతి, ప్రాజెక్ట్ చైర్మన్ డికె రాకేష్, ప్రతినిధులు ఆకుల రాజు, ప్రశాంత్ గౌడ్, గుజరాతి ప్రకాష్, బాలాజీ రావు, గోల్డ్ రాజు, దాచేపల్లి సంతోష్, నసీరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.