లాంటావు దీవుల్లో కేసీఆర్ పర్యటన
నేడు హైదరాబాద్‌కు..
హైదరాబాద్,సెప్టెంబర్15(జనంసాక్షి):
చైనా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కెసిఆర్, ఆయన బృందం మంగళవారం హాంకాంగ్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా లాన్‌టావు దీవిలో గల ప్రఖ్యాత బుద్ధుడి విగ్రహాన్ని ఆయన సందర్శించారు. ఇక్కడ నెలకొల్పిన 202 టన్నుల బుద్ధుడి కాంస్య విగ్రహం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు హాంకాంగ్ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. ఇవాళ ఆయన హాంకాంగ్‌లోని రినెసెన్స్ హార్టర్ వ్యూ ¬టల్‌లో పారిశ్రామిక వేత్తలతో భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను అక్కడి పారిశ్రామికవేత్తలకు వివరించారు. అలాగే ఇక్కడి పలు చారిత్రక ప్రాంతాలను సందర్శించారు. స్పీకర్ మధుసూధనాచారి, మంత్రి జగదీశ్ రెడ్డి, వేణుగోపాలాచారి ఇతర అధికారులు ఉన్నారు
సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చైనా పర్యటన విజయవంతంగా ముగియనుంది. పది రోజుల చైనా పర్యటనను ముగించుకుని ఆయన నేడు సాయంత్రం హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. ఇవాళ తొమ్మిదో రోజు పర్యటనలో భాగంగా ఆయన హాంకాంగ్‌లో పర్యటించారు. ఇవాళ హాంగ్‌కాంగ్‌లోని లాన్‌టావులో ఉన్న 202 టన్నుల కంచు బుద్ద విగ్రహాన్ని ఆయన సందర్శించారు. కాగా, తన పర్యటనలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని చైనాలోని పారిశ్రామిక వేత్తలకు సీఎం వివరించారు.