లాక్‌ డౌన్‌ సడలిస్తే ముప్పే..

` ఏదో సాకుతో 20 నుంచి బయట తిరిగితే తప్పే…
` మే 3 దాకా గృహ నిర్బంధం పొడిగింపుకే మెజారిటీ జనం మొగ్గు
` కేసీఆర్‌ బాటలో నడిచేందుకు సిద్ధమైన తెంగాణా జనం
లాక్‌డౌన్‌కే సై.. సడలింపుకు నై… ‘ఇదే తెంగాణం’
` ‘నె రోజు ఆగినం, ఇంకొన్ని రోజు ఆగలేమా?’
` ‘వైరస్‌ వ్యాప్తి మూడో దశలోకి వెళితే అమెరికానే చేతులెత్తేసింది, మనమెంత?’
` ‘ఇంత కట్టడి ఉన్నా ఆగని కేసు, సడలిస్తే ప్రమాదమే’
`‘కలో గంజో తాగుదాం, ప్రాణాలైతే కాపాడుకుందాం’
` ‘రాష్ట్రాన్ని కాపాడుతున్న దేవుడు కెసిఆర్‌’
` ‘జనంసాక్షి’తో అభిప్రాయాు పంచుకున్న తెంగాణ జనం
` ‘ఇంటికి చేరుకుంటే బాగుండు’ అని మధనపడుతున్న వసకూలీు

గొడ్లకు కాపుంటెనే మంచిది బాంచెన్‌.. యీంత కొన్ని రోజు కండీషన్‌ ఉంటేనే మంచిది. ఇప్పటికైతే కరీంనగర్‌ నుంచి శవాు పోలె… విూ దయ వలాన, అందరి దయవలాన. ఈడికి విూరే మంచోళ్ళు.. కెసిఆర్‌కు మొక్కాలె’’…

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 16(జనంసాక్షి):

ఇది ఒక కరీంనగర్‌ అవ్వ అభిప్రాయమే కాదు రాష్ట్రవ్యాప్తంగా ‘జనంసాక్షి’ నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో వ్లెడైన సారాంశం. కరోనా వైరస్‌ కట్టడి కోసం గతనె ఇరవై రెండున జనతా కర్ఫ్యూతో మొదలైన లాక్‌డౌన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్‌ ముప్పయో తేదీ వరకు పొడిగించగా, మే 3 తేదీ వరకు కేంద్ర ప్రభుత్వం పొడిగించిన విషయం అందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసు పెరుగుతున్నందున లాక్‌ డౌన్‌ పొడిగింపును అందరూ స్వాగతించారు. ఇదే సమయంలో ఈనె ఇరవయో తేదీ నుండి లాక్‌ డౌన్‌ లో కొన్నింటికి సడలింపు ఇస్తున్నట్లు కేంద్రప్రభుత్వం ప్రకటించడంతో ప్రజలో అయోమయం నెకొంది. దీంతో ఈ అంశం విూద ప్రజాభిప్రాయం సేకరించడానికి తెంగాణ రాష్ట్రవ్యాప్తంగా ‘జనంసాక్షి’ ప్రయత్నించింది. కొంత మంది వస కూలీు ఇంటికి దూరంగా ఉన్నామని మధనపడుతున్నప్పటికీ దాదాపు 98 శాతం ప్రజు లాక్‌ డౌన్‌ పొడిగింపును సమర్ధించడంతో పాటు నిబంధన సడలింపును వ్యతిరేకించారు. దేశంలో అందరికన్నా ముందు లాక్‌డౌన్‌ ప్రకటించి తెంగాణను ఆదర్శంగా నిలిపిన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు కరోనా వైరస్‌ ను రాష్ట్రం నుండి తరిమిగొట్టేదాకా ఇదే వైఖరిని కొనసాగించాని ప్రజు అభిప్రాయపడుతున్నారు. లాక్‌డౌన్‌ ప్రకటించినప్పుడే ‘వస కూలీతో సహా రాష్ట్రంలో ఒక్కరు కూడా ఆకలితో ఉండకూడదు’ అని ప్రకటించిన సీఎం కెసిఆర్‌ రాష్ట్రాన్ని కంటికి రెప్పలా కాపాడుతూ సంబంధిత మంత్రుతో సహా మొత్తం అధికార యంత్రాంగాన్ని ఆ దిశగా నడిపిస్తున్నారని, పేదందరికీ 12 కిలో బియ్యం, త్లె రేషన్‌ కార్డుకు రూ.1500, రేషన్‌ కార్డు లేని పేదకు రూ.500 ఇస్తున్నందున రాష్ట్రంలోని పేదకు ఇప్పటికిప్పుడు వచ్చిన ఇబ్బందు ఏమి లేవని చాలామంది అంటున్నారు. ఇదే సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా దాత సహాయసహకారాతో స్వచ్చంద సంస్థు, సామాజిక సేవకు చేపడుతున్న కార్యక్రమాను కూడా ప్రజు గుర్తు చేసుకుంటు న్నారు. దాదాపు నె రోజు కఠిన నిబంధనతో లాక్‌ డౌన్‌ పూర్తి చేసుకున్నప్పటికీ కరోనా కేసు పెరుగుతూనే ఉన్నందున సడలింపు సమంజసం కాదు అని తమ అభిప్రాయాన్ని స్పష్టంగా వెలిబుచ్చుతున్నారు. కరోనా వైరస్‌ విషయంలో ఇటలీ, అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాు మొదట ఉదాసీనంగా వ్యవహరించి ఇప్పుడు చేతు ఎత్తేసేపరిస్థితి తెచ్చుకున్న అంశాన్ని కూడా కొందరు గుర్తు చేస్తున్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వం ముందు ప్రకటించినట్లుగా మే మూడో తేదీ వరకు సడలింపు లేని లాక్‌ డౌన్‌ కొనసాగిస్తే ప్రయోజనం ఉంటుందని అంటు న్నారు. మరోవైపు కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందు కు కేంద్రప్రభుత్వం ముందు నుండి కూడా సరైన సమయంలో సరైన నిర్ణయాు తీసుకోవడం లేదని పువురు విమర్శకు అభిప్రాయప డుతున్నారు. దేశంలోకి కరోనా వైరస్‌ ప్రవేశించిన తర్వాత ఆస్యంగా స్పందించిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు వైరస్‌ ఏమాత్రం అదుపులోకి రాకముందే లాక్‌ డౌన్‌ నిబంధనను సడలించడం విచిత్రంగా ఉందంటున్నారు. కేంద్రప్రభుత్వం లాక్‌ డౌన్‌ నిబంధనను సడలించిన ప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాు స్థానిక పరిస్థితును, వ్యాధి తీవ్రతను పరిగణలోకి తీసుకొని నిర్ణయాు తీసుకోవాని సూచిస్తు న్నారు. కేంద్రం లాక్‌ డౌన్‌ సడలించిన అనంతరం అక్కడ వచ్చే ఫలితాు ఎలా ఉంటాయో పరిశీలించాక ఆచితూచి అడుగు వేయడమే తెంగాణ రాష్ట్రానికి, ప్రజకు మంచిదని ‘జనంసాక్షి’ అభిప్రాయం.

తాజావార్తలు