లాతూరు చేరుకున్న నీటి రైలు


5
ముంబయి: మహారాష్ట్రలో ఈ ఏడాది నీటి ఎద్దడి విపరీతంగా ఉంది. తీవ్ర కరవుతో అటు ప్రజలకు.. ఇటు పశువులకు తాగు నీరు కూడా దొరకడం లేదు. ముఖ్యంగా మరాఠ్వాడా ప్రాంతంలోని లాతూరులో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. వాడకానికే కాదు… తాగేందుకు కూడా నీరు దొరక్క ప్రజలు అల్లాడుతున్నారు. దీంతో సుమారు 5లక్షల లీటర్ల నీటిని రైలు ద్వారా లాతూరుకు తరలించారు అధికారులు. 300 కిలోమీటర్ల దూరంలోని మిరాజ్‌ రైల్వేస్టేషన్లో నీటిని నింపుకుని నిన్న బయలుదేరిన ఈ రైలు ఈరోజు ఉదయం లాతూరు చేరుకుంది. మొదట 50 వ్యాగన్ల ద్వారా నీటిని తీసుకొచ్చేందుకు ప్రయత్నించినా.. దూరం ఎక్కువగా ఉండటంతో 10 వ్యాగన్లకే పరిమితం చేశారు. త్వరలోనే మరోసారి రైలు ద్వారా నీటిని తీసుకొస్తామని అధికారులు చెబుతున్నారు. ఈ నీటితో లాతూరు ప్రజల నీటి కష్టాలు తాత్కాలికంగా తీరనున్నాయి.