లాతూర్ వాసులపై రైల్వేశాఖ కరుణ

మరాఠ్వాడా కరువు ప్రాంతమైన లాతూర్ కు ఊరట లభించింది. నీటి రైళ్ల రవాణా చార్జీలకు సంబంధించి ఆ జిల్లా అధికారులకు జారీచేసిన రూ.4 కోట్ల బిల్లును రైల్వేశాఖ ఉపసంహరించుకుంది. అంతే కాదు.. నీటి కరువు తీరేంతవరకు నీటిరైళ్లను పంపుతామని హామీ ఇచ్చింది. ఈమేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుత సమయంలో రవాణా చార్జీల బిల్లు అంశం అప్రస్తుతమని, కరువు ప్రాంతానికి నీటిని పంపడమే ప్రధానమని పేర్కొంది. రైల్వే శాఖ నిర్ణయంపై లాతూరు ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేశారు. తమ దాహార్తిని తీరుస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు.