లారా రికార్డును బ్రేక్ చేసిన కోహ్లీ
నేపియర్,జనవరి24(జనంసాక్షి): టీమిండియా పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ మరో రికార్డును అధిగమించాడు. నేపియర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో 45 పరుగులు చేసిన కోహ్లీ వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో టాప్-10లోకి ప్రవేశించాడు. ఈ క్రమంలో విండీస్ దిగ్గజ ఆటగాడు బ్రియాన్ లారా రికార్డును బద్దలుగొట్టాడు. 289 వన్డేలు ఆడిన లారా 10,405 పరుగులు చేయగా, కోహ్లీ కేవలం 212 ఇన్నింగ్స్‌లలోనే 10,430 పరుగులు చేశాడు. వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో సచిన్ టెండూల్కర్ 18,426 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 452 ఇన్నింగ్స్‌లలో సచిన్ ఈ ఘనత సాధించాడు. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా కుమార సంగక్కర 14,234 (380 ఇన్నింగ్స్‌లు), రికీ పాంటింగ్ 13,704 (365), సనత్ జయసూర్య 13,430 (433), మహేల జయవర్ధనే 12,650(418), ఇంజిమాముల్ హాక్ 11,739(350), జాక్వస్ కలిస్ 11,579 (314), సౌరవ్ గంగూలీ 11,363 (300), రాహుల్ ద్రవిడ్ 10,889 (318) పరుగులు చేయగా తాజాగా టీమిండియా సారథి విరాట్ కోహ్లీ అందరికంటే తక్కువ ఇన్నింగ్స్‌లలోనే 10,430 పరుగులు చేసి టాప్-10లో చోటు సంపాదించుకున్నాడు.