లారీ ఢీకొన్న ప్రమాదంలో ఓమహిళ మృతి

చింతకాని: మండలంలోని నాగులవంచ వద్ద ద్విచక్ర వాహన్ని లారీ ఢీకొన్న ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. విజయవాడకు చెందిన వెంకటరెడ్డి, పద్మ దంపతులు ద్విచక్రవాహనంపై వస్తుండగా ఎదురుగా వస్తున్న లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో పద్మ అక్కడికక్కడే మృతి చెందగా.. భర్తకు స్వల్ప గాయాలయ్యాయి. అతన్ని చింతకాని ఆసుపత్రికి తరలించారు.